అరవింద సమేత టీజర్ దుమ్ము రేపేలా ఉంది


Ntr aravinda sametha veera raghava teaser outయంగ్ టైగర్ ఎన్టీఆర్ అరవింద సమేత వీర రాఘవ టీజర్ కొద్దిసేపటి క్రితం విడుదల చేసారు . 72 వ స్వాతంత్య్ర దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకొని ఈ టీజర్ ని విడుదల చేసారు . ఆ టీజర్ ఎలా ఉందో తెలుసా …….. ఊర మాస్ ప్రేక్షకులకు పిచ్చ నచ్చేలా ఉంది . ఈ టీజర్ తో ఎన్టీఆర్ దుమ్ము రేపడం ఖాయం అంటే నమ్మండి . జగపతిబాబు వాయిస్ బ్యాగ్రౌండ్ లో వస్తుంటే ఎన్టీఆర్ వీర లేవల్ల్లో వీర రాఘవుడిగా రెచ్చిపోతుంటే రౌడీల మూక ఎన్టీఆర్ ధాటిని తట్టుకోలేక పారిపోతుంటే ……. ఆ రాజసం చూడముచ్చటగా ఉంది . ఇక ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఈ ఒక్క టీజర్ చాలు రికార్డులు బద్దలు కావడానికి అన్నట్లుగా సంతోషపడటం ఖాయం .

రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే నటిస్తుండగా కీలక పాత్రల్లో ఈశా రెబ్బా , జగపతిబాబు , నాగబాబు లు నటిస్తున్నారు . దసరా కానుకగా అక్టోబర్ లో అరవింద సమేత వీర రాఘవ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . ఆగస్ట్ 15న వచ్చిన టీజర్ తో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవ్వడం ఖాయం .

English Title: ntr aravinda sametha veera raghava teaser out