ఎన్టీఆర్ వేడుక మారింది


NTR biopic audio event changed

ఎన్టీఆర్ బయోపిక్ ఆడియో వేడుక ని ఈనెల 21న భారీ ఎత్తున ఎన్టీఆర్ స్వగ్రామమైన నిమ్మకూరు లో చేయడానికి సన్నాహాలు చేసారు . అయితే ఆంధ్రప్రదేశ్ తుఫాన్ భీభత్సంతో అట్టుడికిపోతోంది అందువల్లనా లేక మరో కారణమో కానీ నిమ్మకూరు నుండి ఎన్టీఆర్ బయోపిక్ వేడుక మార్చారు హైదరాబాద్ కు . హైదరాబాద్ లోని జె ఆర్ సి కన్వెన్షన్ సెంటర్ లో ఈనెల 21న ఎన్టీఆర్ బయోపిక్ ఆడియో వేడుక నిర్వహించనున్నారు .

నిమ్మకూరు కు బదులుగా జేఆర్ సి కన్వెన్షన్ కు మారింది అంతే ! అయితే ఎందుకు నిమ్మకూరు నుండి హైదరాబాద్ కు మార్చింది మాత్రం వెల్లడించలేదు . నందమూరి బాలకృష్ణ నటిస్తూ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా 2019 జనవరి 9 న ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రాన్ని విడుదల చేసి జనవరి నెలాఖరు లేదా ఫిబ్రవరిలో రెండో భాగమైన ఎన్టీఆర్ మహానాయకుడు ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో విద్యాబాలన్ , రానా , సుమంత్ , నిత్యామీనన్ , శ్రియ , రకుల్ ప్రీత్ సింగ్ , పాయల్ రాజ్ పుత్ , రాశి ఖన్నా తదితరులు .

English Title: NTR biopic audio event changed