ఆ సినిమా ముందుకు సాగుతుందా


ntr biopic facing lot of problemsఎన్టీఆర్ బయోపిక్ చేయాలనీ నందమూరి బాలకృష్ణ ఏ సమయాన అనుకున్నాడో కానీ ఆ సినిమాకు నిజంగానే సినిమా కష్టాలు వచ్చి పడ్డాయి . ఎన్టీఆర్ బయోపిక్ కోసం నటీనటుల ఎంపిక కూడా పూర్తి కాలేదు , చాలామంది హీరోయిన్ లను అనుకున్నారు అయితే కొందరు ఆ సినిమాలో నటించడానికి ఒప్పుకోలేదు , ఆ సమస్య అలా ఉండగానే దర్శకుడు తేజ ఎన్టీఆర్ బయోపిక్ నుండి తప్పుకున్నాడు నేను ఆ సినిమా చేయలేనని .

కట్ చేస్తే పలువురు ప్రముఖులను పరిశీలించిన మీదట ఎట్టకేలకు దర్శకుడిగా క్రిష్ ని ఎంపిక చేసాడు బాలయ్య ,అయితే ఇప్పుడు కూడా ఎన్టీఆర్ బయోపిక్ పై నీలినీడలు కమ్ముకున్నాయి …… ఎందుకో తెలుసా ……. రెండేళ్ల క్రితం పెళ్లి చేసుకున్న క్రిష్ సంసార జీవితం సవ్యంగా సాగుతోందని అనుకున్నారు కానీ ఆ సంసారంలో కల్లోలం చెలరేగుతోందని , విడాకులకు అప్లయ్ చేసారని తెలుస్తోంది . అంటే క్రిష్ మనసు ప్రశాంతంగా ఉండటం కష్టమే కొద్దిరోజుల పాటు . ఈ సమయంలో క్రిష్ డైరెక్షన్ చేస్తే ఆ సినిమా సరిగ్గా వస్తుందా ? ఎన్టీఆర్ బయోపిక్ సవ్యంగా ముందుకు సాగుతుందా ? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న . ఎన్టీఆర్ బయోపిక్ అన్నది ప్రతిష్టాత్మక చిత్రం దాన్ని సరిగ్గా తీయలేకపోతే విమర్శలు వచ్చే అవకాశం ఉంది . ఎన్టీఆర్ బయోపిక్ ముహూర్త సమయం ఏంటో కానీ చాలా ఇబ్బందులు పడుతోంది ఆ ప్రాజెక్ట్ .