ఎన్టీఆర్ బయోపిక్ కు కష్టాలు : నాదెండ్ల నోటీసులు

ntr biopic in problem nadendla bhaskar rao family sends notice to balakrishnaఎన్టీఆర్ బయోపిక్ ఏ క్షణంలో ప్రారంభమైందో కానీ అప్పటి వరుసగా ఆ చిత్రాన్ని కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి . తాజాగా మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు తనయుడు ఎన్టీఆర్ బయోపిక్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బాలయ్య కు నోటీసులు పంపాడు . మా నాన్న మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు ని కుట్ర దారుడిగా పేర్కొంటూ మా కుటుంబాన్ని నెగెటివ్ షేడ్ లో చూపించాలని ప్రయత్నం చేస్తున్నట్లు నాకు తెలుస్తోంది కావున అలా మా కుటుంబాన్ని కనుక వ్యతిరేకంగా చూపిస్తే సహించేది లేదని అంటున్నాడు అంతేకాదు కోర్టు ద్వారా నోటీసులు కూడా పంపాడు .

ఈ నోటీసులు కూడా రెండు పంపాడు ఒక్క బాలయ్య కే . ఒకటేమో శాసనసభ్యుడి హోదాలో , మరొకటి సినీ నటుడు హోదాలో రెండు చోట్లకు బాలయ్య కు పంపాడు ఎందుకంటే నోటీసులు అందలేదు అని చెప్పే సాకు లేకుండా రెండు చోట్ల కు పంపించారు . ఎన్టీఆర్ తొలిసారిగా ముఖ్యమంత్రి అయినప్పుడు నాదెండ్ల భాస్కర్ రావు కూడా ఎన్టీఆర్ మంత్రివర్గంలో పనిచేసాడు అయితే ఎన్టీఆర్ ఫారిన్ టూర్ వెళ్లిన సమయంలో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ఎన్టీఆర్ ని బర్తరఫ్ చేసారు ఆయన స్థానంలో నాదెండ్ల భాస్కర్ రావు ముఖ్యమంత్రి అయ్యాడు . ఎన్టీఆర్ ఫారిన్ టూర్ ని అర్దాంతరంగా ముగించుకొని వచ్చి ప్రజల మద్దతుతో మళ్ళీ అధికార పీఠాన్ని అధిరోహించాడు . ఎన్టీఆర్ బయోపిక్ అంటే తప్పకుండా ఈ ఎపిసోడ్ ఉండాల్సిందే అయితే నాదెండ్ల భాస్కర్ రావు ని విలన్ గా చూపిస్తే సహించేది లేదని అంటున్నారు . మరి ఈ కష్టాన్ని బాలయ్య ఎలా అధిగమిస్తాడో చూడాలి . క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం జూలై 5 నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది . బాలయ్య సరసన విద్యా బాలన్ నటిస్తుండగా పలువురు ప్రముఖులతో పాటు కొత్తవాళ్ల ని కూడా పరిచయం చేయనున్నారు .

English Title: ntr biopic in problem : nadendla bhaskar rao family sends notice to balakrishna