ఎన్టీఆర్ మహానాయకుడు వాయిదా


NTR biopic mahanayakudu postponed

క్రిష్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న చిత్రం ఎన్టీఆర్.
ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలుగా రూపొందుతున్న విషయం తెలిసిందే . మొదటి భాగం ఎన్టీఆర్ కథానాయకుడు కాగా రెండో భాగం ఎన్టీఆర్ మహానాయకుడు . అయితే ఎన్టీఆర్ బయోపిక్ రెండో భాగాన్ని 2019 జనవరి 24 న విడుదల చేయాలనీ అనుకున్నారు కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఫిబ్రవరి 14 న విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది . జనవరి 9 న ఎన్టీఆర్ కథానాయకుడు విడుదల అవుతుండటంతో వెంటనే రెండో భాగాన్ని విడుదల చేయడం కరెక్ట్ కాదని భావించి ఈ నిర్ణయానికి వచ్చారట .

రెండు సినిమాలకు రెండు వారాల గ్యాప్ మాత్రమే ఉండటం వల్ల ఆర్ధిక ఇబ్బందులు తలెత్తడం ఖాయమని బయ్యర్లు చెప్పారట దాంతో ఈ వాయిదా నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది . సంక్రాంతి రేసులో బోలెడు చిత్రాలు పోటీ పడుతుంటాయి . దాంతో థియేటర్ ల సమస్య కూడా తలెత్తుతుంది కాబట్టి వాయిదా వేసుకోవడమే మంచిదని పలువురు సలహా ఇచ్చారట . అందుకే వాయిదా నిర్ణయమని అంటున్నారు . ఎన్టీఆర్ గా బాలయ్య నటిస్తుండగా ఇతర పాత్రల్లో నందమూరి కళ్యాణ్ రామ్ , విద్యాబాలన్ , రానా , నిత్యామీనన్ , రకుల్ ప్రీత్ సింగ్ , రాశి ఖన్నా తదితరులు నటిస్తున్నారు .

English Title: NTR biopic mahanayakudu postponed