ఎన్టీఆర్ లో నారా చంద్రబాబు లుక్ ఇదే


NTR biopic nara chandrababu naidu look releasedఎన్టీఆర్ చిత్రంలో నారా చంద్రబాబు నాయుడు పాత్రని పోషిస్తున్నాడు రానా దగ్గుబాటి , కాగా తాజాగా ఈరోజు దగ్గుబాటి రానా లుక్ ని విడుదల చేసారు ఆ చిత్ర బృందం . నారా చంద్రబాబు నాయుడు పాత్రలో రానా చాలావరకు బాబు ని పోలి ఉన్నాడు దాంతో ఈ సినిమాపై మరింతగా అంచనాలు పెరిగేలా ఉన్నాయి . బాహుబలి , బాహుబలి 2 చిత్రాల వల్ల రానాకు జాతీయ , అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది . ఇక ఎన్టీఆర్ చిత్రంలో ఇప్పటికే బాలీవుడ్ భామ విద్యా బాలన్ నటించిన సన్నివేశాలు చిత్రీకరించిన విషయం తెలిసిందే . దాంతో బాలీవుడ్ లో సైతం ఎన్టీఆర్ చిత్రానికి డిమాండ్ ఏర్పడింది .

ఎన్టీఆర్ పాత్రలో బాలయ్య నటిస్తుండగా హరికృష్ణ పాత్రలో నందమూరి కళ్యాణ్ రామ్ నటించనున్నాడు . అలాగే జూనియర్ ఎన్టీఆర్ ని కూడా ఓ కీలక పాత్రలో నటించేలా ప్రయత్నాలు చేయడం కామన్ అని అంటున్నారు ఎందుకంటే ఇంతకుముందు బాలయ్య – ఎన్టీఆర్ లు ఎడమొహం -పెడమొహం గా ఉండేవారు కానీ హరికృష్ణ మరణం తర్వాత నందమూరి కుటుంబం ఒకటయ్యింది దాంతో ఎన్టీఆర్ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ నటించడం ఖాయమని అంటున్నారు . అదే జరిగితే ఎన్టీఆర్ సినిమా స్థాయి మరింతగా పెరగడం ఖాయం .

English Title: NTR biopic nara chandrababu naidu look released