ఎన్టీఆర్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ ఎందుకో తెలుసా


ntr biopic release date locked

నందమూరి తారకరామారావు బయోపిక్ ని బాలయ్య సాహసోపేతంగా రూపొందించడానికి సిద్దమైన విషయం తెలిసిందే . ఈ సినిమా ఇప్పటివరకు ప్రారంభం మాత్రమే అయ్యింది , ఇంకా రెగ్యులర్ షూటింగ్ మొదలు కాలేదు ఎందుకంటే దర్శకులు తేజ ఈ సినిమాకు దర్శకత్వం వహించడానికి భయం అవుతొంది అంటూ పక్కకు తప్పుకోవడంతో క్రిష్ వచ్చి చేరారు . జూలై 5 నుండి ఎన్టీఆర్ బయోపిక్ రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది అయితే అప్పుడే ఈ సినిమా రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసారు బాలయ్య .

ఇంతకీ ఎన్టీఆర్ బయోపిక్ విడుదల తేదీ ఎప్పుడో తెలుసా ? ఆ రోజునే ఎందుకు విడుదల చేస్తున్నారో తెలుసా ? 2019 జనవరి 9న విడుదల తేదీ ఫిక్స్ చేసారు . ఇక ఆరోజు కున్న ప్రాముఖ్యత ఏంటంటే …… ఎన్టీఆర్ మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యింది జనవరి 9న అందుకే బయోపిక్ ని అదేరోజున విడుదల చేయాలనీ డిసైడ్ అయ్యాడు బాలయ్య . అయితే ఈలోపు సినిమా షూటింగ్ అంతా కంప్లీట్ చేయాలి క్రిష్ దర్శకుడు కాబట్టి తప్పకుండా రిలీజ్ అవుతుంది అని నమ్మకంగా ఉన్నాడట బాలయ్య .