బాలయ్య కూడా మంచి వ్యాపారి అయ్యాడు



Ntr biopic two parts confirmed

ఎన్టీఆర్ చిత్రానికి విపరీతమైన క్రేజ్ రావడంతో దాన్ని క్యాష్ చేసుకోవడానికి సిద్ధమయ్యాడు నందమూరి బాలకృష్ణ. మొదట ఎన్టీఆర్ ప్రాజెక్ట్ కు అంతగా క్రేజ్ రాలేదు అయితే ఎప్పుడైతే దర్శకుడు గా క్రిష్ ఎంటర్ అయ్యాడో అప్పుడు ఎన్టీఆర్ ప్రాజెక్ట్ కు ఎనలేని క్రేజ్ వచ్చింది. బాలీవుడ్ భామ విద్యాబాలన్ , సుమంత్ , రానా , నందమూరి కళ్యాణ్ రామ్ లు యాడ్ అవ్వడంతో పాటు ఎన్టీఆర్ గెటప్ లో బాలయ్య ఫస్ట్ లుక్ రావడంతో అనూహ్యంగా ఎన్టీఆర్ చిత్రానికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. పెద్ద ఎత్తున బయ్యర్లు ఎన్టీఆర్ చిత్రం కోసం పోటీ పడుతుండటంతో దాన్ని క్యాష్ చేసుకోవడానికి ఎన్టీఆర్ ని రెండు పార్ట్ లుగా విడుదల చేయాలని డిసైడ్ అయ్యాడు బాలయ్య.

అందుకే ఈరోజు ఉదయం ఎన్టీఆర్ కథానాయకుడు అంటూ ఓ పోస్టర్ ని విడుదల చేసారు దాంట్లో జనవరి 9న విడుదల అని ప్రకటించారు. మరో పోస్టర్ సాయంత్రానికి విడుదల చేసారు. ఎన్టీఆర్ మహా నాయకుడు అని.ఇంతకుముందు ఎన్టీఆర్ అని మాత్రమే ప్రకటించి సస్పెన్స్ మెయింటైన్ చేశారు . ఇక ఇప్పుడేమో ఆ సస్పెన్స్ కి తెరదించుతూ మొదటి భాగానికి కథానాయకుడు అని రెండో భాగానికి మహా నాయకుడు అని పెట్టారు. ఇక ఈ రెండు భాగాన్ని జనవరి 24న విడుదల చేయనున్నారట . అంటే 15 రోజుల వ్యవధిలో రెండు భాగాలు విడుదల అవుతున్నాయన్నమాట .

English Title: Ntr biopic two parts confirmed

Ntr biopic two parts confirmed