ఎన్టీఆర్ కారు య‌మ కాస్ట్‌లీ గురూ!

ఎన్టీఆర్ కారు య‌మ కాస్ట్‌లీ గురూ!
ఎన్టీఆర్ కారు య‌మ కాస్ట్‌లీ గురూ!

ఖ‌రీదైన‌, మ‌న‌సుకు న‌చ్చిన కార్లంటే సామాన్యుడి నుంచి స్టార్ హీరోల వ‌ర‌కు మ‌క్కువే. స్టార్‌డ‌మ్‌ని సొంతం చేసుకుని కోట్ల‌ల్లో పారితోషికాలు అందుకునే హీరోలు కంటికి న‌చ్చిన కార్ క‌నిపిస్తే కొనేయ‌కుండా వుంటారా?. ఇలా న‌చ్చిన కార్ల‌ని కొనాల‌ని త‌పించే హీరోల్లో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కూడా ఒక‌రు. మార్కెట్‌లోకి కొత్త‌గా ఏదైనా కారు వ‌చ్చిందంటే మ‌న హీరోలు ఆరా తీస్తుంటారు.

అలాగే ఎన్టీఆర్‌కు కూడా ఈ అల‌వాటు వుంద‌ట‌. ప్ర‌స్తుతం `ఆర్ ఆర్ ఆర్`లో గోండు బెబ్బులి కొమ‌రం భీం పాత్ర‌లో న‌టిస్తున్న యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ క‌న్ను తాజాగా అత్యంత ఖ‌రీదైన కారుపై ప‌డింది. అలా అని ఊరికే వుండ‌లేదు. వెంట‌నే ఆ కార్‌ని బుక్ చేసేశాడు. ల‌గ్జ‌రీ ఫీచ‌ర్ల‌తో పాటు హై సెక్యూరిటీ వున్న ఈ కార్ పేరు లాంబోర్గిని ఉర‌స్‌. దీని కాస్ట్ అక్ష‌రాలా 5 కోట్లు.

ఇండియాలో వున్న మోస్ట్ ల‌గ్జ‌రీ కార్ల‌లో ఇది ముందు వ‌రుస‌లో నిలుస్తుంద‌ని చెబుతున్నారు. ఇటీవ‌ల `మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు` షోకి హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించ‌డానికి అంగీక‌రించిన ఎన్టీఆర్ ఆ కార్య‌క్ర‌మం ద్వారా వ‌చ్చిన మొత్తంతో ఈ కారుని బుక్ చేసిన‌ట్టు చెబుతున్నారు. త్వ‌ర‌లోనే ఈ కార్ ఇండియాకు రానుంద‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఇది టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీగా మారింది. ఈ విష‌యం తెలిసిన వాళ్లంతా ఎన్టీఆర్ కార్ య‌మ కాస్ట్‌లీ గురూ అంటున్నారు.