ఎన్టీఆర్ @ బిగ్ బాస్ 4 : అంతా ఉత్తుత్తిదేనా?


ఎన్టీఆర్ @ బిగ్ బాస్ 4 : అంతా ఉత్తుత్తిదేనా?
ఎన్టీఆర్ @ బిగ్ బాస్ 4 : అంతా ఉత్తుత్తిదేనా?

బిగ్ బాస్ 3 ముగిసింది. అంతా సర్దుకుంది. బిగ్ బాస్ 3 అయిన కొన్ని రోజులకు కంటెస్టెంట్లు అందరూ వరసపెట్టి ఇంటర్వ్యూలు ఇస్తూ తెగ హల్చల్ చేసారు, ఇప్పుడు అంతా కామ్ అయిపోయింది. స్టార్ మా వారు ఈ సీజన్ పెద్ద హిట్ అయిందని ప్రకటించారు. మొదటి రెండు సీజన్ల కంటే మూడో సీజన్ అద్భుతమైన హిట్ అయిందని టీఆర్పిలతో సహా ప్రకటించారు. సీజన్ 2 ను వివాదాలు చుట్టుముట్టేయడంతో సీజన్ 3 విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించారు. పగడ్బందీగా ఉన్నారు. పైగా హోస్ట్ గా నాగార్జున కూడా హుందాతనంగా ఉండడంతో సీజన్ 3 కు అసలు వివాదాలు రాలేదు. షో కూడా వన్ సైడ్ అయిన భావన కలగలేదు. ఈ నేపథ్యంలో నాగార్జుననే నాలుగు సీజన్ కు హోస్ట్ గా తీసుకుందామని ప్లాన్ చేస్తున్నారు బిగ్ బాస్ యాజమాన్యం.

మూడో సీజన్ మంచి హిట్ అవ్వడంతో నాలుగో సీజన్ ను మరింత ముందే నిర్వహించాలని భావిస్తున్నారు. నిజానికి మూడో సీజన్ ప్రతిసారి కంటే కొంత ఆలస్యంగా మొదలైంది. ఈ నేపథ్యంలో మూడో సీజన్ జరిగిన దానికంటే ఒక నెల ముందుగానే ఈ షో ను నిర్వహించాలని అనుకుంటున్నారు. ఇటీవలే బిగ్ బాస్ సెట్ ను తీసేసిన బృందం వచ్చే మే నుండి మళ్ళీ సెట్ చేసుకోవాలని ప్రణాళికలు వేస్తున్నారు. అలాగే జనవరి నుండి ఒక 40 – 50 మంది కంటెస్టెంట్స్ ప్రాబబుల్స్ ను వేసుకుని వారితో సంప్రదింపులు జరపాలని నిర్ణయించుకున్నారు. మూడో సీజన్ లో కంటెస్టెంట్లకు ఇచ్చే రెమ్యునరేషన్లు అవీ బయటకు లీక్ అవ్వడంతో ఈసారి మరింత పగడ్బందీగా ఉండాలి అనుకుంటున్నారు. మూడో సీజన్ లో దొర్లిన తప్పులను సరిచేసి ఈసారి మరింత ఎంటర్టైనింగ్ షో ను నిర్వహించాలన్న నిర్ణయం తీసుకున్నారు. అలాగే పేరున్న వారినే నాలుగో సీజన్ లో పెట్టాలని నిర్ణయించుకున్నారు.

ఇదిలా ఉంటే హోస్ట్ విషయంలో రకరకాల అభిప్రాయాలూ వినిపిస్తున్నాయి. బిగ్ బాస్ సీజన్ 1 కు ఎన్టీఆర్ హోస్ట్ కాగా, సీజన్ 2 కు నాని, సీజన్ 3 కి నాగార్జున వ్యవహరించారు. అయితే నాలుగో సీజన్ కు మళ్ళీ తారక్ వస్తాడని వార్తలు వస్తున్నాయి. తొలి సీజన్ ఎంటర్టైనింగ్ గా మారడానికి ఎన్టీఆర్ హోస్టింగ్ ప్రధాన కారణం. ప్రేక్షకులు దాన్ని మిస్ అవుతున్నారు. నాగార్జున హోస్టింగ్ హుందాగా ఉంది కానీ అంత ఎంటర్టైనింగ్ గా లేదు కాబట్టి తారక్ ను మళ్ళీ హోస్ట్ గా తీసుకురమ్మని విజ్ఞప్తులు పెరుగుతున్నాయి. అయితే ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ కు కమిటెడ్ గా ఉన్న తారక్, ఆ సమయానికి ఆర్ ఆర్ ఆర్ నుండి ఫ్రీ అవుతాడో లేడో చెప్పలేం. ఒకవేళ ఫ్రీ అయినా కానీ ఎన్టీఆర్ తర్వాత ప్యాన్ ఇండియా లెవెల్లో సినిమాను ప్లాన్ చేస్తున్నాడు. ప్రశాంత్ నీల్ తో కానీ, అట్లీతో కానీ సినిమా చేయాలని అనుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ ను తారక్ హోస్ట్ చేస్తాడని అనుకోలేము.