ఓటు హక్కు వినియోగించుకున్న ఎన్టీఆర్


యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన ఓటు హక్కుని వినియోగించుకున్నాడు . ఈరోజు తెల్లవారు ఝామునే తన తల్లి షాలిని , భార్య ప్రణతి తో కలిసి వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నాడు ఎన్టీఆర్ . జూబ్లీహిల్స్ లోని ఓబుల్ రెడ్డి స్కూల్ లో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు ఎన్టీఆర్ అండ్ కో . సెలబ్రిటీలు ఓటు హక్కు వినియోగించుకోవడం వల్ల వాళ్ళ అభిమానులు కూడా ఓటు హక్కు వినియోగించుకోవడం ఖాయం . అలాగే ఇతరులకు స్ఫూర్తిదాయకం కూడా . 
 
ఎన్టీఆర్ తో పాటుగా అల్లు అర్జున్ , ఎం ఎం కీరవాణి , అమల , తదితర సినీ ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు . ఎన్టీఆర్ తాజాగా ఆర్ ఆర్ ఆర్ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే . అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఆర్ ఆర్ ఆర్ చిత్రం 2020 లో రిలీజ్ కానుంది .