ఇక అన్న కళ్యాణ్ రామ్ కోసం తమ్ముడు ఎన్టీఆర్ 118 చిత్ర ప్రమోషన్ కోసం రానున్నాడట . కెరీర్ మొదటి నుండి కూడా కళ్యాణ్ రామ్ హిట్ , ప్లాప్ లతో సంబంధం లేకుండా విభిన్న కథా చిత్రాలను చేస్తున్నాడు . అయితే అందులో విజయాల కంటే అపజయాలు ఎక్కువగా ఉన్నాయి కానీ ఈ 118 చిత్రం మాత్రం తప్పకుండా హిట్ అవుతుందన్న ఆశాభావంతో ఉన్నాడు . నివేదా థామస్ , షాలిని పాండే హీరోయిన్ లుగా నటించిన ఈ చిత్రానికి కెవి గుహన్ దర్శకత్వం వహిస్తుండగా మహేష్ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మించాడు .
English Title: NTR chief guest for Kalyan ram’s 118