ఎన్టీఆర్ లైనప్ – భారీగానే ప్లాన్ చేస్తున్నాడు!

ఎన్టీఆర్ లైనప్ - భారీగానే ప్లాన్ చేస్తున్నాడు!
ఎన్టీఆర్ లైనప్ – భారీగానే ప్లాన్ చేస్తున్నాడు!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ గత కొన్నేళ్లుగా కెరీర్ బెస్ట్ ఫేజ్ లో ఉన్నాడు. టెంపర్ నుండి మొదలుపెట్టి వరసగా హిట్ చిత్రాలు చేస్తున్నాడు. అరవింద సమేత తర్వాత ఎన్టీఆర్ కెరీర్ లో భారీ గ్యాప్ వచ్చింది. అయితే ఆ గ్యాప్ రాజమౌళి దర్శకత్వంలో చేస్తోన్న ఆర్ ఆర్ ఆర్ సినిమా గురించేనన్న విషయం మనందరికీ తెల్సిందే.

నవంబర్ 2018 నుండి షూటింగ్ పూర్తి చేసుకుంటున్న ఆర్ ఆర్ ఆర్ కు కరోనా భారీ దెబ్బ వేసింది. ఈ ఏడాదిలో కచ్చితంగా సినిమా విడుదలవుతుందని అంటున్నారు. ఆర్ ఆర్ ఆర్ తర్వాత కొరటాల శివతో ఎన్టీఆర్ పనిచేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చిన విషయం తెల్సిందే. నిన్ననే అంతర్జాతీయ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన ఎన్టీఆర్ ఈ విషయాన్ని ధృవీకరించాడు.

కొరటాల శివతో సినిమాకు లైన్ అనుకున్నాము. ఇంకా ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం కాలేదు. జనతా గ్యారేజ్ తర్వాత మళ్ళీ కొరటాల శివతో పనిచేయడం ఆనందంగా ఉంది అని తెలిపాడు. అలాగే దాని తర్వాత ప్రశాంత్ నీల్ తో ప్రాజెక్ట్ ఉంటుందని కన్ఫర్మ్ చేసాడు ఎన్టీఆర్.

ఆర్ ఆర్ ఆర్, కొరటాల శివ చిత్రం, ప్రశాంత్ నీల్ సినిమా… ఎన్టీఆర్ లైనప్ అదిరిందిగా!