ఎన్టీఆర్ అభిమాని మృతి


యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని మొదటి సినిమా నుండి అభిమానిస్తున్న జయదేవ్ అనే అభిమాని చనిపోవడంతో షాక్ కి గురయ్యాడు ఎన్టీఆర్ . జయదేవ్ మృతి నన్ను తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసిందని ఓ ప్రకటనలో తెలిపాడు జూనియర్ ఎన్టీఆర్ . హీరోగా జూనియర్ ఎన్టీఆర్ మొదటి చిత్రం ” నిన్ను చూడాలని ” . అది అంతగా ఆడలేదు అయినప్పటికీ నందమూరి వంశం అన్నా …… జూనియర్ ఎన్టీఆర్ అన్నా చాలా ఇష్టం జయదేవ్ కు . దాంతో జూనియర్ ఎన్టీఆర్ కు సన్నిహితుడయ్యాడు జయదేవ్ .

నేను విజయాలు సాధించాను అలాగే ఎన్నో పరాజయాలు చవిచూశాను అన్నింటిలో కూడా నాకు తోడుగా ఉన్నది నా అభిమానులే ! ఆలాంటి అభిమానుల్లో జయదేవ్ నాకు సన్నిహితుడు అతడి మృతి నన్ను తీవ్రంగా కలిచివేసింది అంటూ ఓ స్టేట్మెంట్ ఇచ్చాడు జూనియర్ ఎన్టీఆర్ .