ఎన్టీఆర్‌ని రిట‌ర్న్ గిఫ్ట్ అడిగిన అభిమాని!


ఎన్టీఆర్‌ని రిట‌ర్న్ గిఫ్ట్ అడిగిన అభిమాని!
ఎన్టీఆర్‌ని రిట‌ర్న్ గిఫ్ట్ అడిగిన అభిమాని!

స్టార్స్‌ని ఫ్యాన్స్ డెమీ గాడ్స్‌గా భావిస్తుంటార‌న్న‌ది తెలిసిందే. వారి కోసం ఏం చేయ‌డానికైనా సిద్ధ‌ప‌డుతుంటారు. ఎన్టీఆర్ అభిమాని కూడా ఇలాంటి ప‌నే చేశాడు. అత‌ను చేసిన ప‌ని ఇప్పుడు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అంతే కాకుండా త‌ను చేసిన ప‌నికి స‌ద‌రు అభిమాని ఎన్టీఆర్‌ని రిట‌ర్న్ గిఫ్ట్ అడ‌గ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ఔట‌ర్ రింగ్ రోడ్‌పై యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ అతి వేగంతో కార్‌ని న‌డిపినందుకు గాను ఆ కార్‌కి 1035 రూ. ట్రాఫిక్ పోలీసులు ఫైన్ వేశారు. అయితే ఈ ఫైన్‌ని ఎన్టీఆర్ క‌ట్ట‌లేదట‌. విష‌యం తెలిసి స‌ద‌రు అభిమాని ఆ ఫైన్ మొత్తాన్ని ఆన్ లైన్‌లో పే చేశాడు. పే చేయ‌డ‌మే కాకుండా అందుకు బ‌దులుగా త‌న‌కు ఆర్ఆర్ఆర్ మూవీ తొలి రోజు తొలి షో టిక్కెట్స్  ఇవ్వ‌మ‌ని రిట‌ర్న్ గిఫ్ట్ కింద అడ‌గ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ప్ర‌స్తుతం ఎన్టీఆర్ అభిమాని సోష‌ల్ మీడియా వేదిక‌గా పెట్టిన ఈ పోస్ట్ వైరల్ గా మారింది. రామ్‌చ‌ర‌ణ్‌తో క‌లిసి ఎన్టీఆర్ న‌టిస్తున్న `ఆర్ఆర్ఆర్‌` మూవీ క్లైమాక్స్ చిత్రీక‌ర‌ణ ప్ర‌స్తుతం ఆర్ ఎఫ్‌సీలో జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. రోమాంచిత స‌న్నివేశాల‌తో ఈ క్లైమాక్స్‌ని రాజ‌మౌళి చిత్రీక‌రిస్తున్నారు. సినిమాకి ఈ క్లైమాక్స్ ప్ర‌ధాన హైలైట్‌గా నిల‌వ‌నుంద‌ట‌.