విజయ్ దేవరకొండ అంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు కోపంNTR fans fires on vijay devarakonda

విజయ్ దేవరకొండ అంటే మండిపడుతున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్ . అసలు విజయ్ దేవరకొండకు ఎన్టీఆర్ కు సంబంధమే లేదు కానీ ఒక్క సినిమా వల్ల ఇద్దరు హీరోల అభిమానులు తిట్టుకునేలా చేస్తోంది . ఇంతకీ విజయ్ దేవరకొండ మీద ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు కోపం ఎందుకో తెలుసా …… …. నోటా చిత్రం అక్టోబర్ 5న విడుదల అవుతుండటమే ! అక్టోబర్ 11న ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత వీర రాఘవ చిత్రం రిలీజ్ అని ఎప్పుడో ప్రకటించారు కానీ తీరా సమయానికి ఎన్టీఆర్ కు పోటీగా అక్టోబర్ 5 లేదా 10 న నోటా చిత్రాన్ని విడుదల చేయడానికి సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండ పోల్ నిర్వహించాడు దాంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు ఎక్కడలేని కోపం వచ్చింది .

మా హీరో చిత్రానికి పోటీగా నోటా వదులుతావా , అసలు నోటా వల్ల మా అరవిందు డికి వచ్చిన నష్టం ఏమి లేదని ఎన్టీఆర్ క్రేజ్ ముందు నువ్వెంత ? అంటూ ఫైర్ అవుతున్నారు . అయితే అనూహ్యంగా నోటా చిత్రం అక్టోబర్ 5న రిలీజ్ అని డేట్ ప్రకటించారు అంటే ఎన్టీఆర్ సినిమాకు నోటా చిత్రానికి వారం గ్యాప్ ఉంది దాంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ హ్యాపీ గా ఫీల్ అవుతున్నారు . నోటా చిత్రం రాజకీయ నేపథ్యం ఉన్న సినిమా , అరవింద సమేత వీర రాఘవ చిత్రం ఏమో రాయలసీమ నేపథ్యం తో పాటుగా ఎంటర్ టైన్ మెంట్ కూడా ఉంది కాబట్టి అరవింద సమేత కే మొగ్గు ఉంటుంది మరి .

English Title: NTR fans fires on vijay devarakonda