మహేష్ – చరణ్ లకు సవాల్ విసిరిన ఎన్టీఆర్


ntr fitness challenge to mahesh babu and charanమలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ఫిట్ నెస్ ఛాలెంజ్ విసరడంతో ఆ ఛాలెంజ్ ని స్వీకరించిన ఎన్టీఆర్ ” సార్ మీ ఛాలెంజ్ ని స్వీకరిస్తున్నాను ” అంటూ ఓ వీడియో ని పోస్ట్ చేసాడు . ఛాలెంజ్ ని స్వీకరించిన ఎన్టీఆర్ తాజాగా మహేష్ బాబు , చరణ్ లకు ఆ సవాల్ ని విసిరాడు . మహేష్ బాబు , చరణ్ లతో పాటుగా అన్న నందమూరి కళ్యాణ్ రామ్ , దర్శకులు రాజమౌళి లకు ఫిట్ నెస్ సవాల్ ని విసిరాడు . నా ఛాలెంజ్ ని స్వీకరించండి ఫిట్ నెస్ ని నిరూపించుకోండి అంటూ ట్వీట్ చేసాడు ఎన్టీఆర్ .

మహేష్ బాబు ప్రస్తుతం ఫిట్ నెస్ పై ద్రుష్టి పెట్టాడు తన తదుపరి సినిమా కోసం , ఇక చరణ్ అయితే ఆల్రెడీ జిమ్ లో కష్టపడుతున్నాడు కాబట్టి ఎన్టీఆర్ సవాల్ ని స్వీకరించడం పెద్ద పని కాదు . అన్న కళ్యాణ్ రామ్ కూడా సిక్స్ ప్యాక్ తో ఉన్నాడు అయితే దర్శకులు ఎస్ ఎస్ రాజమౌళి మాత్రం ఎన్టీఆర్ సవాల్ స్వీకరించడం కష్టమే పాపం . చరణ్ అకౌంట్ ఎన్టీఆర్ కు దొరకలేదట దాంతో ఆ ఛాలెంజ్ ని స్వీకరించమని ఉపాసన ని కోరాడు . ఉపాసన చరణ్ కు చెప్పడం చరణ్ స్వీకరించడం జరగడం ఖాయం . కేంద్రమంత్రి రాజ్యవర్ధన్ సింగ్ విసిరిన ఈ సవాల్ మెల్లిగా దేశమంతటా వ్యాపిస్తోంది .