బిగ్ బాస్ 3 కి ఎన్టీఆర్ కన్ఫర్మ్ అట


NTR fix for Bigg boss 3

రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగులో కూడా  సక్సెస్ అయిన విషయం తెలిసిందే . మొదటి సిరీస్ కు ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించగా రెండో సీజన్ కు నాని హోస్ట్ గా వ్యవహరించాడు . ఇక ఇప్పుడేమో మూడో సీజన్ కు సన్నాహాలు చేస్తున్నారు . అయితే ఈ మూడో సీజన్ కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ నే తీసుకోవాలని డిసైడ్ అయ్యారట బిగ్ బాస్ నిర్వాహకులు . ఎందుకంటే ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన సీజన్ బ్రహ్మాండమైన సక్సెస్ అయ్యింది.

నాని కూడా హోస్ట్ గా సక్సెస్ అయ్యాడు కానీ కొన్ని వివాదాలు చుట్టుముట్టాయి దాంతో బిగ్ బాస్ 3 కి ఎన్టీఆర్ అయితేనే కరెక్ట్ అని ఫిక్స్ అయ్యారట ! అంతేకాదు భారీ మొత్తాన్ని ఆఫర్ చేశారట దాంతో ఎన్టీఆర్ కూడా సై అన్నాడట . ఇక మిగిలింది జక్కన్న తో మాట్లాడి ఆర్ ఆర్ ఆర్ గ్యాప్ లో ఈ షో చేయడం అంతే !

English Title: NTR fix for Bigg boss 3