
కరోనా కారణంగా లాక్డౌన్ విధించడంతో సమాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అంతా గత ఎనిమిది నెలలుగా ఇంటికే పరిమితం అయ్యారు. తాజాగా అన్‌లాక్ ప్రక్రియ ప్రారంభం కావడంతో సెలబ్రిటీలు విహార యాత్రలకు వెళుతున్నారు. ఇన్నాళ్లు ఇంటి పట్టునే గడిపిన వారంతా రిలాక్స్ కోసం ఫ్యామిలతో కలిసి వెరేషన్కు వెళుతున్నారు.
ఇటీవల స్టార్ హీరో మహేష్ ఫ్యామిలీతో కలిసి దుబాయ్ వెళ్లిన విషయం తెలిసిందే. ఇదే బాటలో యంగ్‌టైగర్ ఎన్టీఆర్ కూడా ఫ్యామిలీతో వెకేషన్‌కి దుబాయ్‌కి వెళుతున్నారు. ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న `ఆర్ ఆర్ ఆర్` చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ షూటింగ్‌కి స్మాల్ బ్రేక్ లభించడంతో ఎన్టీఆర్ ఫ్యామిలీతో కలిసి దుబాయ్ పయనమయ్యారు.
అయితే ఈ విషయాన్ని మాత్రం ఎన్టీఆర్ రహస్యంగా వుంచారు. మహేష్ తన ఫ్యామిలీతో కలిసి దుబాయ్ వెళుతున్న ఫొటోల్ని సోషల్ మీడియాలో పంచుకున్న విషయం తెలిసిందే. కానీ ఎన్టీఆర్ మాత్రం అలా చేయకుండా తన హాలీడే ట్రిప్‌ని రహస్యంగా వుంచారు. ప్రస్తుతం వైఫ్ ప్రణతితో కలిసి ఫొటోలకు పోజులిచ్చిన ఎన్టీఆర్ పిక్స్ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి.