జగన్ పార్టీ తరుపున ఎన్టీఆర్ మనవడు


NTR grandson want to contest on YSRCP ticket

నందమూరి తారకరామారావు మనవడు హితేష్ చెంచురామ్ జగన్ పార్టీ తరుపున ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు . ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు వెన్నంటి ఉన్న డాక్టర్ దగ్గుబాటి వేంకటేశ్వర రావు- పురంధేశ్వరి ల తనయుడే ఈ హితేష్ చెంచురామ్ . గతకొంత కాలంగా దగ్గుబాటి వెంకటేశ్వర్ రావు క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నాడు . అయితే ఎన్నికల బరిలో తనకు బదులుగా తన తనయుడు హితేష్ ని రంగంలోకి దించాలని భావిస్తున్నాడు దగ్గుబాటి . అందుకే ప్రతిపక్ష నేత అయిన వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ని తన తనయుడితో కలిసాడు .

కొడుకు భవిష్యత్ కోసం జగన్ తో చర్చించిన అనంతరం మీడియా ముందుకు వచ్చిన దగ్గుబాటి చంద్రబాబు పాలనపై నిప్పులు చెరిగాడు . త్వరలోనే జగన్ పార్టీలో హితేష్ చేరబోతున్నాడని , ఎప్పుడు ….. ఎక్కడ అన్నది మాత్రం మా అనుచరులతో సమావేశమైన తర్వాత తెలియజేస్తామన్నారు దగ్గుబాటి . అలాగే పురంధేశ్వరి భారతీయ జనతా పార్టీలోనే ఉంటుందని హితేష్ మాత్రం జగన్ పార్టీలో చేరతాడని స్పష్టం చేసాడు . ఇక ఎన్టీఆర్ మనవడు అయిన హితేష్ జగన్ పార్టీ తరుపున పోటీ చేస్తే ప్రజలు ఎలా ఆదరిస్తారు అన్నది మరో మూడు నెలల్లో తేలిపోనుంది .

English title: NTR grandson want to contest on YSRCP ticket