మానసిక ఒత్తిడికి గురవుతున్న ఎన్టీఆర్ హీరోయిన్!


మానసిక ఒత్తిడికి గురవుతున్న ఎన్టీఆర్ హీరోయిన్!
మానసిక ఒత్తిడికి గురవుతున్న ఎన్టీఆర్ హీరోయిన్!

బాలీవుడ్ యువ హీరో సుశాంత్  సింగ్ రాజ్ పుత్  ఆత్మహత్య చేసుకోవడం యావత్ సినీలోకాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ విషయాన్ని ఇప్పటికీ కొంతమంది తారలు నమ్మలేకపొతున్నారు. సుశాంత్ ఆత్మహత్య ఎందుకు చేసుకున్నారు? … ఆయన మేనేజర్ కూడా ఆత్మ హత్య ఎందుకు చేసుకుంది అన్న కోణంలో బాంద్రా పోలీస్ లు విచారణ మొదలుపెట్టారు.

ఇదిలా ఉంటే ఎన్టీఆర్ హీరోయిన్, బాలీవుడ్ నటి పాయల్ ఘోష్ చేసిన వ్యాఖ్యలు కలకలం సృస్తిస్తున్నాయి. ఎన్టీఆర్ నటించిన ‘ఊసరవెల్లి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన పాయల్ ఘోష్ గత ఐదేళ్లుగా మసనసిక ఒత్తిడికి గురయిందంట.
ఫామిలీ మెంబర్స్ సహకారంతో తాను బయట పడ్డానని తెలిపింది. తాజాగా సుశాంత్ సింగ్ ఆత్మహత్య చేసుకోవడంతో తానూ ఆవార్త విని మరింత మళ్లీ మానసికంగా ఒత్తిడికి గురయ్యానని చెబుతోంది. దీంతో నెటిజన్స్, బాలీవుడ్ వర్గాలు షాక్ కు గురవుతున్నారట.