అమేజాన్ లో ఎన్టీఆర్ కథానాయకుడు


 NTR Kathanayakudu in amazon prime

రేపు ఫిబ్రవరి 8న ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు అమేజాన్ ప్రైమ్ నిర్వాహకులు . కొత్త చిత్రాలను అమేజాన్ లో పెడుతున్న విషయం తెలిసిందే , అయితే ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రాన్ని మాత్రం నెల రోజుల వ్యవధిలోనే రిలీజ్ చేస్తున్నారు దాంతో షాక్ అవుతున్నారు నెటిజన్లు  . జనవరి 9 న భారీ ఎత్తున రిలీజ్ అయ్యింది ఎన్టీఆర్ కథానాయకుడు .

 

ఎన్టీఆర్ జీవిత చరిత్ర కావడంతో ఎన్టీఆర్ బయోపిక్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి , అయితే ఆ అంచనాలను అందుకోవడంలో ఘోరంగా విఫలమయ్యింది ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రం . సినిమాకు రివ్యూస్ బాగానే వచ్చినప్పటికీ కలెక్షన్లు మాత్రం ఘోరంగా వచ్చాయి దాంతో బయ్యర్లు 50 కోట్ల మేర నష్టపోయారు . మొదటి పార్ట్ డిజాస్టర్ కావడంతో రెండో పార్ట్ ని బాగానే రిపేర్లు చేస్తున్నారు క్రిష్ అండ్ కో . ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రాన్ని థియేటర్ లో మిస్ అయిన వాళ్ళు అమేజాన్ లో చూడొచ్చు .

 

English Title:  NTR Kathanayakudu in amazon prime