ఎన్టీఆర్ ను ఢీకొట్టే విలన్ ఎవరబ్బా?

ఎన్టీఆర్ ను ఢీకొట్టే విలన్ ఎవరబ్బా?
ఎన్టీఆర్ ను ఢీకొట్టే విలన్ ఎవరబ్బా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్, టాప్ దర్శకుడు కొరటాల శివతో టీమప్ అయిన విషయం తెల్సిందే. ఈ సినిమా అతి త్వరలోనే లాంచ్ కానుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ ను పూర్తి చేస్తున్నాడు. దాని తర్వాత టివి షో ఎవరు మీలో కోటీశ్వరులు ప్రోగ్రామ్ ను హోస్ట్ చేయాల్సి ఉంది. ఈలోగా దర్శకుడు కొరటాల శివ కూడా తన ప్రాజెక్ట్ ను పూర్తి చేస్తాడు.

మెగాస్టార్ చిరంజీవితో ఆచార్య చిత్రాన్ని చేస్తున్నాడు. చాలా గ్యాప్ తర్వాత రీసెంట్ గా ఈ సినిమా షూటింగ్ తిరిగి మొదలైంది. మరో రెండు నెలల్లో ఎన్టీఆర్ – కొరటాల శివ మూవీ లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈలోగా కొరటాల శివ కాస్ట్ అండ్ క్రూ ను ఎంపిక చేస్తున్నాడు. కియారా అద్వానీ ఈ చిత్రంలో హీరోయిన్ గా ఖరారు అవుతుందని అంటున్నారు.

అలాగే అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తాడు. ఇక విలన్ గా ఎవరు చేస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది. మరో భాషలో యంగ్ అండ్ హ్యాపెనింగ్ హీరోను ఈ సినిమాలో విలన్ గా ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయట. చూద్దాం.