ఎన్టీఆర్ – కొరటాల శివ సినిమాకు అనిరుద్?

ఎన్టీఆర్ - కొరటాల శివ సినిమాకు అనిరుద్?
ఎన్టీఆర్ – కొరటాల శివ సినిమాకు అనిరుద్?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ లో పాల్గొంటున్నాడు; జులైతో ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ ను మొత్తం పూర్తి చేయాలని పట్టుదలగా ఉంది టీమ్. అలాగే దర్శకుడు కొరటాల శివ ఎప్పటినుండో ఆచార్య చిత్రంతో స్ట్రక్ అయిపోయి ఉన్నాడు. కరోనా కారణంగా చాలా నెలలు షూటింగ్ అలానే నిలిచిపోయింది.

వీరిద్దరూ కలిసి సినిమా చేయబోతున్నట్లు ప్రకటించిన విషయం తెల్సిందే. వీరిద్దరి కాంబినేషన్ లో ఇదివరకే జనతా గ్యారేజ్ వచ్చింది. మరోసారి క్లాస్ గా మ్యాజిక్ క్రియేట్ చేయబోతున్నారు. ఆగస్ట్ నుండి ఈ చిత్ర పనులు మొదలుపెట్టాలని భావిస్తున్నారు. కియారా అద్వానీని హీరోయిన్ గా ఫిక్స్ చేసారు.

అలాగే కొరటాల శివ అనిరుద్ తో కలిసి వర్క్ చేయనున్నాడు. తన తొలి నాలుగు సినిమాలకు దేవి శ్రీ ప్రసాద్ తో పనిచేసిన కొరటాల శివ, ఐదో చిత్రానికి మణిశర్మను సంగీత దర్శకుడిగా ఎంచుకున్నాడు. ఇప్పుడు మాత్రం అనిరుద్ ను తీసుకుంటున్నాడని తెలుస్తోంది. అనిరుద్ ప్రస్తుతం తమిళ్ లో టాప్ సినిమాలకు వర్క్ చేస్తున్నాడు. మరి ఎన్టీఆర్ కోసం ఎలాంటి ట్యూన్స్ సిద్ధం చేస్తాడో చూడాలి.