అఫీషియ‌ల్‌: కొర‌టాల‌తో ఎన్టీఆర్ 30 ఫైన‌ల్‌!

NTR Koratalas Blockbuster Combo is Back
NTR Koratalas Blockbuster Combo is Back

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ `ఆర్ ఆర్ ఆర్‌` త‌రువాత మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్‌తో సినిమా చేయాల‌ని ప్లాన్ చేశారు. దీనికి సంబంధించిన అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ కూడా వ‌చ్చేసింది. హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించాల‌ని ప్లాన్ చేశాయి. అయితే గ‌త కొన్ని రోజులుగా ఈ ప్రాజెక్ట్ ముందుకు క‌ద‌ల‌డం లేదు. దీంతో త్ర‌విక్ర‌మ్‌, ఎన్టీఆర్ మ‌ధ్య మ‌న‌స్ప‌ర్థ‌లు వచ్చాయిని ఇక ఈ ప్రాజెక్ట్ ముందుకు క‌ద‌ల‌డం క‌ష్ట‌మ‌నే మాట‌లు వినిపించాయి.

తాజాగా అదే జ‌రిగింది. అంతా ఊహించిన‌ట్టుగానే ఎన్టీఆర్ 30కి సంబంధించిన అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ వ‌చ్చేసింది. త్రి‌విక్ర‌మ్‌తో చేయాల్సిన 30వ చిత్రాన్నిఎన్టీఆర్ స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ‌తో చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఈ చిత్రాన్ని హీరో నంద‌మూరి క‌ల్యాణ్‌రామ్ స‌మ‌ర్ప‌ణ‌లో యువ సుధా ఆర్ట్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్స్‌పై సుధాక‌ర్ మిక్కిలినేని, కొస‌రాజు హ‌రికృష్ణ సంయుక్తంగా నిర్మించ‌బోతున్నారు.

`జ‌న‌తా గ్యారేజ్‌` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ త‌రువాత మ‌రోసారి కొర‌టాల‌, ఎన్టీఆర్‌ల క‌ల‌యిక‌లో రానున్న ఈ మూవీ జూన్ ద్వితీయార్థంలో ప్రారంభం కానుంది. వ‌చ్చే ఏడాది ఏప్రిల్ 29న రిలీజ్ చేయాల‌ని డేట్ కూడా ఫిక్స్ చేశారు. `ఎన్టీఆర్‌తో మ‌రోసారి క‌ల‌వ‌డం ఆనందంగా వుంది. ఇంత‌కు ముందు లోక‌ల్‌గా వున్న మ‌ర‌మ్మ‌త్తులు చేశాం. కానీ ఈ సారి బౌండ‌రీస్ దాట‌బోతున్నా` అని ద‌ర్శ‌కుడు కొర‌టాల ట్వీట్ చేశారు. అంటే ఇది పాన్ ఇండియా మూవీ అని ఇండైరెక్ట్‌గా చెప్పార‌న్న‌మాట‌.