ఖద్దర్లో ఎన్టీఆర్ .. లుక్ టెస్ట్ జరిగిందా?


ఖద్దర్లో ఎన్టీఆర్ .. లుక్ టెస్ట్ జరిగిందా?
ఖద్దర్లో ఎన్టీఆర్ .. లుక్ టెస్ట్ జరిగిందా?

జక్కన్న తెరకెక్కిస్తున్న చిత్రం ‘ ఆర్ ఆర్ ఆర్’. రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్నారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్, ఆదివాసీ వీరుడు కొమరం భీం పాత్రలో నటిస్తున్నాడు. 70 శాతం షూటింగ్ పూర్తయింది. మరో 30 శాతం చిత్రీకరణ బాలెన్సుగా వుంది.

కరోనా తీవ్రత తగ్గితే షూటింగ్ మొదలు పెట్టాలని రాజమౌళి ప్లాన్  చేస్తున్నారు. హైదరాబాద్ లో కరోనా విలయతాండవం  చేస్తున్న నేపథ్యంలో షూటింగ్ లు  అప్పుడే మొదలు పెట్టడం అంత మంచిది కాదని ఆగస్టు వరకు వేచి చూడాలనే ధోరణిలో ఉన్నట్టు తెలిసింది.  ఇదిలా ఉంటే ఎన్టీఆర్ ఈ సినిమా తరువాత  త్రివిక్రమ్ తో తన 30వ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే,
హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్ రాధా కృష్ణ తో కలిసి కళ్యాణరామ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పొలిటికల్ సెటైరికల్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్ని తేర పైకి తీసుకురానున్నారట. ఇందు కోసం కోవిడ్ నిబంధనల ప్రకారం ఎన్టీఆర్ పై లుక్ టెస్ట్ కు సంబంధించిన లుక్ టెస్ట్ జరిపినట్టు తెలిసింది. లుక్ టెస్ట్ లో ఎన్టీఆర్ వైట్ అండ్ వైట్ ఖద్దర్ ని ధరించాడట. ఈ చిత్రానికి ‘అయిననూ పోయిరావలె హస్తినకు’ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.