రేపు 5 సినిమాలు రిలీజ్NTR mahanayakudu fighting for success

రేపు 5 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అయితే ఆ అయిదు సినిమాల్లో ఏది  హిట్ అవుతుందో మాత్రం దేనిపై కూడా అంచనాలు లేకుండాపోయాయి . రేపు విడుదల అవుతున్న చిత్రాల్లో ఎన్టీఆర్ మహానాయకుడు , అంజలి సీబీఐ , 4 లెటర్స్ , మిఠాయి , ప్రేమెంత పనిచేసే నారాయణ చిత్రాలు ఉన్నాయి . అయితే వీటిలో కాస్త అంచనాలు ఉన్న సినిమా ఎన్టీఆర్ మహానాయకుడు మాత్రమే !

 

అయితే ఎన్టీఆర్ కథానాయకుడు డిజాస్టర్ కావడంతో ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రంపై నీలి నీడలు కమ్ముకున్నాయి . అందుకే ఈ సినిమాపై పెద్దగా అంచనాలు లేకుండాపోయాయి . ఇక ఈ సినిమాతో పాటుగా రిలీజ్ అవుతున్న చిత్రాల్లో కూడా దేనిపై అంచనాలు లేవు . రిలీజ్ అయితే అవుతున్నాయి కానీ ఏది మంచి వసూళ్ల ని రాబడుతుంది అన్నది మాత్రం మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది .

English Title: NTR mahanayakudu fighting for success