ఇంతకీ ఎన్టీఆర్ పేరు ఏంటి ?


ntr name trending in diffarent soundsయంగ్ టైగర్ ఎన్టీఆర్ అసలు పేరు తారక్ అయితే తాత నందమూరి తారకరామారావు అని తన పేరుని పెట్టాడు అలా తారక్ ఎన్టీఆర్ అయ్యాడు కట్ చేస్తే ఇప్పుడు ఎన్టీఆర్ పేరుని ఒక్కొక్కరు ఒక్కోలా వాడుతున్నారు . ఇటీవలే దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తాను దర్శకత్వం చేపట్టే సినిమా అధికారిక ప్రకటన జారీ చేసాడు . అందులో RRR అని రాసి ఆశ్చర్యపరిచారు . రాజమౌళి , రామారావు , రాంచరణ్ అని అర్ధం వచ్చేలా అది పెట్టారు బాగానే ఉంది అనుకుంటే ఇప్పుడేమో TTT అంటూ ఓ ట్వీట్ వచ్చింది .

ఇక ఈ మూడు టి లకు అర్ధం ఏంటో తెలుసా ……. తారక్ , త్రివిక్రమ్ , తమన్ అని అర్ధం . ఎన్టీఆర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించడానికి సమాయత్తం అవుతున్న విషయం తెలిసిందే . ఆ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు దాంతో ట్రిపుల్ టి లను ట్యాగ్ చేస్తూ తమన్ ట్వీట్ చేసాడు . దాంతో ఎన్టీఆర్ పేరుని ఒకరు R గా ఇంకొకరు T గా ట్రీట్ చేస్తున్నారు అన్నమాట .