ఆర్ ఆర్ ఆర్ : ఒలీవియా – ఎన్టీఆర్ లవ్ ఎపిసోడ్స్ పై లేటెస్ట్ అప్డేట్


  ఆర్ ఆర్ ఆర్ : ఒలీవియా - ఎన్టీఆర్ లవ్ ఎపిసోడ్స్ పై లేటెస్ట్ అప్డేట్
ఆర్ ఆర్ ఆర్ : ఒలీవియా – ఎన్టీఆర్ లవ్ ఎపిసోడ్స్ పై లేటెస్ట్ అప్డేట్

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి ఆర్ ఆర్ ఆర్ లో నటిస్తోన్న విషయం తెల్సిందే. ఈ సినిమా షూటింగ్ లాక్ డౌన్ కు ముందు శరవేగంగా సాగింది. దాదాపు 75 శాతం షూటింగ్ పూర్తయింది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కు జోడిగా బ్రిటిష్ నటి ఒలీవియా, రామ్ చరణ్ కు జంటగా బాలీవుడ్ భామ అలియా భట్ నటిస్తోన్న విషయం తెల్సిందే. ముఖ్యంగా ఎన్టీఆర్ – ఒలీవియా జోడీపై గత కొన్ని రోజులుగా ఆసక్తికర కథనాలు వెలువడుతున్నాయి.

ఒలీవియా పాత్ర గురించి మాట్లాడుతూ ఈ సినిమాలో ఆమెది ఎన్టీఆర్ ను విపరీతంగా ప్రేమించే వ్యక్తి పాత్ర. అతనిపై ప్రేమతో ప్రాణాలను సైతం కోల్పోతుంది. అయితే ఎన్టీఆర్ – ఒలీవియా మధ్యన ప్రేమను చాలా ఘాడంగా చూపించాడట రాజమౌళి. ఈ ఎపిసోడ్ చాలా స్పెషల్ గా ఉంటుందని, జక్కన్న చాలా శ్రద్ధ పెట్టి ఈ ఎపిసోడ్ ను వర్కౌట్ చేసాడని సమాచారం.

వీరిద్దరి మధ్యన ఎపిసోడ్ ను ఇప్పటికే పూర్తి చేసేసారట. తాజా సమాచారం ప్రకారం ఎడిటర్ ఇప్పటికే ఈ సీన్స్ పై వర్కౌట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక తెలంగాణ యాసలో ఎన్టీఆర్ పలికే డైలాగులు సరికొత్తగా ఉంటాయని సమాచారం. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఎం ఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న విషయం తెల్సిందే. జనవరి 8న ఈ చిత్రాన్ని విడుదల చేద్దామని ప్లాన్ చేసారు కానీ లాక్ డౌన్ కారణంగా షూటింగ్ లు అనుకున్న ప్రకారం సాగలేదు. ఇక ఇప్పుడు వచ్చే సమ్మర్ కు విడుదల చేయాలనుకుంటున్నారు.