ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్… యూరి కనెక్షన్?

ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్... యూరి కనెక్షన్?
ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్… యూరి కనెక్షన్?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన కెరీర్ సినిమాల సెటప్ చూస్తే ఎవరికైనా కుళ్ళు రావడం సహజం. ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ లో కొమురం భీమ్ పాత్రలో నటిస్తోన్న ఎన్టీఆర్, ఆ తర్వాత కొరటాల శివ చిత్రంలో ఒక మెసేజ్ ఓరియెంటెడ్ సబ్జెక్ట్ ను చేయనున్నాడు. ఇది తన కెరీర్ లో 30వ చిత్రం. ఇక దాని తర్వాత చేయనున్న 31వ చిత్రంపైనే అందరి కళ్ళూ ఉన్నాయి. ఎందుకంటే ఆ ప్రాజెక్టును డైరెక్ట్ చేసేది కెజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్.

ఈ సినిమా సబ్జెక్ట్ ఇదంటూ ఒక రూమర్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. దాని ప్రకారం ఈ చిత్రంలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడట. అలాగే ఉగ్రవాదం, రాజకీయం నేపథ్యంలో సినిమా చాలా సీరియస్ గా సాగుతుందని తెలుస్తోంది. గూస్ బంప్స్ మూమెంట్స్ కు ఎక్కడా కొదవ ఉండదట.

ఒక రోల్ లో పవర్ఫుల్ రాజకీయ నాయకుడిగా, మరో రోల్ లో సైనికుడిగా ఎన్టీఆర్ ఇరగదీసే స్కోప్ ఉన్న రెండు పాత్రలను పోషించనున్నాడట. మరిన్ని వివరాలు త్వరలోనే తెలుస్తాయి.