ఎన్టీఆర్ – ప్ర‌శాంత్ నీల్ మూవీ బ‌డ్జెట్ అంతా?


ఎన్టీఆర్ - ప్ర‌శాంత్ నీల్ మూవీ బ‌డ్జెట్ అంతా?
ఎన్టీఆర్ – ప్ర‌శాంత్ నీల్ మూవీ బ‌డ్జెట్ అంతా?

యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్, మెగాప‌వ‌ర్‌స్టార్  రామ్‌చ‌ర‌ణ్‌తో క‌లిసి న‌టిస్తున్న చిత్రం `ఆర్ ఆర్ ఆర్‌`. ఎస్‌.ఎస్‌. రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రాన్ని అత్యంత భారీ బ‌డ్జెట్‌తో డీవీవీ దాన‌య్య నిర్మిస్తున్నారు. పిరియాడిక్ అంశాల‌కు ఫాంట‌సీ అంశాల్ని జోడించి జ‌క్క‌న్న ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. రామ్‌చ‌ర‌ణ్ విప్ల‌వ వీరుడు అల్లూరి సీతారామ‌రాజుగా, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆదివాసీ పోయాట యోధుడు కొమ‌రం భీంగా క‌నిపించ‌బోతున్నారు.

ఇప్ప‌టికే మూడొంతుల చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. మిగ‌తా చిత్రీక‌ర‌ణ పూనేలో ప్లాన్ చేశా‌రు. కానీ క‌రోనా కార‌ణంగా షూటింగ్‌ని వాయిదా వేశారు. లాక్‌డౌన్ త‌రువాత ప్ర‌భుత్వ ఆదేశాల మేర‌కు షూటింగ్‌ని ప్లాన్ చేయ‌బోతున్నారు. ఇదిలా వుంటే యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ ఈ సినిమా త‌రువాత త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ భారీ చిత్రం చేయ‌బోతున్న విష‌యం తెలిసిందే. హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్స్‌పై ఎస్‌. రాధాకృష్ణ‌, నంద‌మూరి క‌ల్యాణ్‌రామ్ ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నారు.

ఈ చిత్రంతో పాటు `కేజీఎఫ్‌` ఫేమ్ ప్ర‌శాంత్ నీల్ తో ఎన్టీఆర్ ఓ భారీ పాన్ ఇండియా స్థాయి చి్త‌రం చేయ‌బోతున్న విష‌యం తెలిసిందే. మైత్రీ మూవీమేక‌ర్స్ నిర్మించ‌నున్న ఈ చిత్రానికి 150 కోట్ల బ‌డ్జెట్ కేటాయించిన‌ట్టు తెలిసింది. దీనికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న ఈ నెల 20న ఎన్టీఆర్ పుట్టిన రోజు సంద‌ర్భంగా చిత్ర వ‌ర్గాలు వెల్ల‌డించ‌నున్న‌ట్టు తెలిసింది.