ఎన్టీఆర్ – ప్ర‌శాంత్ నీల్ మూవీకి ముహూర్తం ఫిక్స్‌!

ఎన్టీఆర్ - ప్ర‌శాంత్ నీల్ మూవీకి ముహూర్తం ఫిక్స్‌!
ఎన్టీఆర్ – ప్ర‌శాంత్ నీల్ మూవీకి ముహూర్తం ఫిక్స్‌!

ఎన్టీఆర్ ఇటీవల త్రివిక్రమ్ తో చేయాల‌నుకున్న మూవీని కొర‌టాల శివ‌తో చేస్తున్న‌ట్టుగా ప్ర‌క‌టించి షాకిచ్చిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం `ఆర్ ఆర్ ఆర్‌`లో న‌టిస్తున్న ఎన్టీఆర్ ఈ మూవీ పూర్తి కాగానే కొర‌టాల శివ ప్రాజెక్ట్‌ని ఎన్టీఆర్ ప‌ట్టాలెక్కించ‌బోతున్నారు. ఇదిలా వుంటే 30వ చిత్రంతో పాటు 31వ చిత్రాన్ని కూడా ఎన్టీఆర్ లైన్‌లో పెట్టేశారు.

దీనిపై టాలీవుడ్ స‌ర్కిల్స్‌లో హాట్ హాట్ చ‌ర్చ న‌డుస్తోంది. ఎన్టీఆర్ త‌న 31 వ చిత్రం కోసం ఒక క్రేజీ దర్శకుడు `కెజిఎఫ్` ఫేమ్ ప్రశాంత్ నీల్ ని ఫైన‌ల్ చేశార‌ట‌. ఈ భారీ పాన్ ఇండియా మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించ‌బోతోంది. ఇదివ‌ర‌కే ఈ ప్రాజెక్ట్ కోసం ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్‌కు మేక‌ర్స్ అడ్వాన్స్ కూడా ఇచ్చేశారు. కానీ అఫీషియ‌ల్‌గా మాత్రం ప్ర‌క‌టించ‌లేదు.

ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా మే 20 న ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన చేయబోతోంది. ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్‌కి సంబంధించిన వార్త‌లు గత ఏడాది నుంచి వినిపిస్తున్నాయి.