షూటింగ్ కి రెడీ అయిన ఎన్టీఆర్


Ntr ready to shooting for Aravinda sametha veera raghavaకన్నతండ్రి మరణంతో దుఃఖసాగరంలో మునిగిన ఎన్టీఆర్ అరవింద సమేత వీర రాఘవ చిత్ర షూటింగ్ కి రెడీ అవుతున్నాడు . ఒకవైపు దుఃఖంలో ఉన్నప్పటికీ మరోవైపు సినిమా సకాలంలో రావాలంటే షూటింగ్ కి వెళ్లాల్సిన తప్పనిపరిస్థితి ఏర్పడటంతో షూటింగ్ కి వెళ్ళడానికే నిర్ణయం తీసుకున్నాడు ఎన్టీఆర్ . ఈరోజు షూటింగ్ కి హాజరు అవుతున్నాడు ఎన్టీఆర్ . ఇటీవలే నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే . తండ్రి మరణించడంతో దుఃఖాన్ని దిగమింగుకొని షూటింగ్ కి వెళ్తున్నాడు ఎన్టీఆర్ .

దసరాకు అరవింద సమేత వీర రాఘవ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . దాంతో దసరా కు సినిమా విడుదల కావాలంటే షూటింగ్ తప్పనిసరి . త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అరవింద సమేత వీర రాఘవ చిత్రంలో ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే నటిస్తుండగా కీలక పాత్రల్లో ఈషా రెబ్బా , జగపతిబాబు , నాగబాబు లు నటిస్తున్నారు . ఒకవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రానికి ప్యాచ్ వర్క్ తో పాటుగా కొన్ని కీలక సన్నివేశాలు ,2 పాటలు బ్యాలెన్స్ గా ఉన్నాయి . వాటిని శరవేగంగా చిత్రీకరించి దసరా బరిలో అరవింద ని దించాలని భావిస్తున్నారు .

English Title: ntr ready to shooting for aravinda sametha veera raghava