కోవిడ్ నుండి పూర్తిగా కోలుకున్న ఎన్టీఆర్

కోవిడ్ నుండి పూర్తిగా కోలుకున్న ఎన్టీఆర్
కోవిడ్ నుండి పూర్తిగా కోలుకున్న ఎన్టీఆర్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ దాదాపు రెండు వారాల క్రితం కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ ఐన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో ఎప్పటినుండి ఎన్టీఆర్ హోమ్ ఐసోలేషన్ లోనే ఉంటున్నాడు. ఇదిలా ఉంటే సరిగ్గా రెండు వారాల అనంతరం ఎన్టీఆర్ కోవిడ్ నుండి పూర్తిగా కోలుకున్నాడు. తనకు కోవిడ్ నెగటివ్ వచ్చిందని సంతోషంగా తెలిపాడు ఎన్టీఆర్. ఈ సందర్భంగా తనకు ట్రీట్మెంట్ ఇచ్చిన వైద్యులకు కృతఙ్ఞతలు తెలిపాడు.

కోవిడ్ పట్ల అలసత్వం ప్రదర్శించకూడదని చాలా జాగ్రత్తగా ఉండాలని ఎన్టీఆర్ సూచించాడు. అయితే ఈ వైరస్ ను సమర్ధంగా ఎదుర్కోవచ్చని, కచ్చితమైన కేర్, పాజిటివ్ మైండ్ సెట్ ఉంటే ఎదురించ వచ్చని ఎన్టీఆర్ తెలిపాడు. మన విల్ పవర్ ఈ పోరాటంలో మన అతి పెద్ద ఆయుధమని ఎన్టీఆర్ అంటున్నాడు. పానిక్ అస్సలు అవ్వకండి అంటున్నాడు. సేఫ్ గా ఉండండి అని ఎన్టీఆర్ పోస్ట్ చేసాడు.

ఎన్టీఆర్ కు కోవిడ్ నెగటివ్ రావడం పట్ల పలువురు సంతోషం వ్యక్తం చేసారు.