ఎన్టీఆర్ రిజెక్ట్ చేసాడట


NTR rejected Nagarjuna acceptedబిగ్ బాస్ 2 షో త్వరలోనే పూర్తి కాబోతోంది దాంతో ఆ షోకి ముఖ్య అథితిగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని ఆహ్వానించారట ! అయితే ఆ ఆహ్వానాన్ని తిరస్కరించాడట . ఎన్టీఆర్ బిగ్ బాస్ మొదటి సిరీస్ కి హోస్ట్ గా వ్యవహరించిన విషయం తెలిసిందే . ఆ షోని ఎన్టీఆర్ ఎంతో రక్తికట్టించారు అయితే తాజాగా రెండో సిరీస్ కొనసాగుతోంది , ఈ సిరీస్ కు నాని హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు . నాని కూడా మంచి మార్కులే కొట్టేసాడు అయితే ఎన్టీఆర్ స్థాయిలో చేయలేకపోతున్నాడు అంటూ కంపేర్ మాత్రం చేస్తున్నారు . బిగ్ బాస్ ఆహ్వానాన్ని ఎన్టీఆర్ రిజెక్ట్ చేయడంతో కింగ్ నాగార్జునని గెస్ట్ గా పిలిచారట . ఇంకేముంది నాగార్జున ఒప్పుకున్నాడు పనిలో పనిగా తన సినిమా దేవదాస్ ప్రమోషన్ ని కూడా బిగ్ బాస్ హౌజ్ లోనే చేయడానికి నిర్ణయించుకున్నాడు .

నాగార్జున – నాని ఇద్దరూ కలిసి దేవదాస్ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే . నిన్ననే దేవదాస్ చిత్రం షూటింగ్ మొత్తం పూర్తయ్యింది . సెప్టెంబర్ 27న సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . మల్టీస్టారర్ చిత్రం కావడంతో ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి . అయితే ఆ అంచనాలను ఎంతమేరకు సఫలం అవుతాయో తెలియాలంటే సినిమా విడుదల అయ్యేంత వరకు ఎదురు చూడాల్సిందే .

English Title: NTR rejected Nagarjuna accepted

NTR rejected Nagarjuna accepted