శాటిలైట్ రేట్ లో రికార్డ్ సృష్టించిన ఎన్టీఆర్


ntr set new record with satellite rightsయంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజా చిత్రానికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది దాంతో ఆ సినిమాని సొంతం చేసుకోవడానికి ఏకంగా 23 కోట్ల ఆఫర్ ఇచ్చింది ప్రముఖ టివి ఛానల్ జీ తెలుగు అయితే ఇంకా రేటు కుదరలేదు 23. 5 దగ్గర లేదంటే 24 కోట్లకు సెట్ అయ్యేలా ఉంది . త్రివిక్రమ్ఎన్టీఆర్ ల కాంబినేషన్ లో వస్తున్న మొదటి సినిమా కావడంతో భారీ క్రేజ్ ఏర్పడింది . శాటిలైట్ రూపంలోనే కాకుండా హిందీ డబ్బింగ్ అలాగే డిజిటల్ రైట్స్ రూపంలో ఈ సినిమాకు 45 కోట్లకు పైగా వచ్చేలా ఉంది . ఇక ఏరియాల వారీగా బిజినెస్ ఎలాగూ ఉండనే ఉంది . దాంతో 120 నుండి 130 కోట్ల మధ్య బిజినెస్ జరిగేలా ఉంది అరవింద సమేత వీర రాఘవ చిత్రానికి .

త్రివిక్రమ్ – ఎన్టీఆర్ ల కాంబినేషన్ అంటే బుల్లితెర పై కూడా క్రేజ్ ఉంటుంది దాంతో జీ తెలుగు పోటీపడి మరీ 23 కోట్లకు ఆఫర్ ఇచ్చింది కానీ నిర్మాతలు 24 ఇస్తే కానీ ఇవ్వం అని అంటున్నారట ! ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే నటిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు – నాగబాబు లు కీలక పాత్రలో నటిస్తున్నారు . ఈషా రెబ్బా కూడా ప్రముఖ పాత్ర పోషిస్తోంది . రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు .

English Title: ntr set new record with satellite rights