ఎన్టీఆర్ నెక్ట్స్ ఫిల్మ్ ఎవ‌రీతో?

ఎన్టీఆర్ నెక్ట్స్ ఫిల్మ్ ఎవ‌రీతో?
ఎన్టీఆర్ నెక్ట్స్ ఫిల్మ్ ఎవ‌రీతో?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న ప్ర‌తిష్టాత్మ‌క చిత్రం `ఆర్ ఆర్ ఆర్‌`లో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ తో క‌లిసి న‌టిస్తున్న ఈ మూవీ చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో వుంది. అయితే ఈ మూవీ త‌రువాత యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ డైరెక్ష‌న్‌లో ఓ పొలిటికల్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ చేయబోతున్నారు.

ఇది ఎన్టీఆర్ న‌టించ‌నున్న 30వ చిత్రం. గ‌త కొన్ని రోజులుగా ఈ మూవీ ఆగిపోయింద‌ని, లేదు లేదు త్వ‌ర‌లోనే స్టార్ట్ కానుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్‌పై మాత్రం క‌న్ఫ్యూజ‌న్ కంటిన్యూ అవుతూనే వుంది. అయితే తాజాగా త్రివిక్ర‌మ్ కంటే ముందు `ఉప్పెన‌` ఫేమ్ సాని బుచ్చిబాబుతో ఓ స్పోర్ట్స్‌డ్రామా చేయ‌బోతున్నార‌ని తెలుస్తోంది.

`నాన్న‌కు ప్రేమ‌తో` మూవీ స‌మ‌యంలో బుచ్చిబాబుతో ఎన్టీఆర్‌కు మంచి ప‌రిచ‌యం ఏర్ప‌డింద‌ట‌. అది ఇప్ప‌టికీ కొన‌సాగుతోంద‌ట‌. `ఉప్పెన‌`తో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ని తొలి ప్ర‌య‌త్నంలోనే ద‌క్కించుకున్న బుచ్చిబాబు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కోసం ఓ ప‌వ‌ర్‌ఫుల్ స్పోర్ట్స్ డ్రామాని ప్లాన్ చేశాడ‌ట‌. దాన్నే ఇటీవ‌ల వినిపించ‌డంతో ఎన్టీఆర్ ఆలైన్‌కి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ని, పూర్తి స్థాయి స్క్రిప్ట్‌తో ర‌మ్మ‌ని బుచ్చిబాబుకు చెప్పార‌ని, ఈ చిత్రాన్ని మైత్రీ మూవీమేక‌ర్స్‌తో క‌లిసి సుకుమార్ నిర్మించ‌నున్నార‌ని తెలిసింది.