తెర మీద “చిరుత”కు తెర వెనుక “పులి” మాటల తూటాలు


తెర మీద “చిరుత”కు తెర వెనుక “పులి” మాటల తూటాలు
తెర మీద “చిరుత”కు తెర వెనుక “పులి” మాటల తూటాలు

పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ బర్త్ డే సందర్భంగా ఆయన తాజా సినిమా “R.R.R” “రౌద్రం రణం రుధిరం” సినిమాలో ఆయన పాత్ర అయిన పాత్ర అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్ కు సంబంధించిన ఒక వీడియో రిలీజ్ చేశారు. ఇది కూడా ఈ సినిమాలో మరొక పాత్రధారి కొమరం భీమ్ క్యారెక్టర్ చేస్తున్న యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకంగా “భీమ్ ఫర్ రామరాజు” అనే ట్యాగ్ లైన్ తో విడుదల చేశారు. మొత్తానికి పుట్టినరోజు కానుకగా ఈ రోజు పొద్దున్నే విడుదల చేస్తానని జూనియర్ ఎన్టీఆర్ ప్రకటించినా… దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళి గారు మరి కొంచెం ఆ గిఫ్ట్ కి మెరుగులు దిద్ది ఈరోజు సాయంత్రం విడుదల చేశారు.

 ఇక దాదాపు 11 సంవత్సరాల క్రితం 2009 లో మగధీర సినిమాలో ఒకసారి రామ్ చరణ్ తేజ్ ను “శతదృవంశ యోధుడు కాలభైరవ” గా చూపించిన జక్కన్న ఈ సారి అంతకు వందరెట్లు హీరోయిజాన్నిమన్యం బెబ్బులి స్వాతంత్ర సమరయోధుడు సీతారామరాజు పాత్ర ద్వారా చూపించారు. ఇక ఈ వీడియోకు అత్యంత ప్రధానమైన బలం జూనియర్ ఎన్టీఆర్ అద్భుతంగా చెప్పిన వాయిస్ ఓవర్. ఇక్కడ విశేషమేమిటంటే తెలుగు,తమిళం, కన్నడ మూడు భాషలలో కూడా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ స్వయంగా ఈ ఇంట్రడక్షన్ డైలాగ్స్ చెప్పారు.

ఇక ఎన్టీఆర్ అనగానే గుర్తొచ్చేది ఆయన అద్భుతమైన డిక్షన్,మాడ్యులేషన్,డైలాగ్ డెలివరీ. ఎన్టీఆర్ డైలాగ్ డెలివరీ ఎంత అద్భుతంగా ఉంటుందో స్వయంగా ఎస్.ఎస్ రాజమౌళి తెరకెక్కించిన యమదొంగ సినిమాలో యముడి పాత్రలో చూశాం. ఆ తర్వాత మళ్లీ ఆ స్థాయిలో ఆయన గత చిత్రం “జై లవకుశ” లో కూడా చెలరేగిపోయారు ఎన్టీఆర్. ఇక ఇప్పుడు ప్రస్తుతం “ఆర్.ఆర్.ఆర్” సినిమాకు సంబంధించి 3 భాషలలో కూడా అద్భుతమైన మాడ్యులేషన్ తో స్వయంగా తమిళం మరియు కన్నడం భాషలలో అద్భుతమైన పట్టు ఉన్నవ్యక్తి చెప్పినట్లుగా ఉంది ఆ వీడియో చూస్తే..

మొత్తానికి తన అన్నకు జూనియర్ ఎన్టీఆర్ ఈ సందర్భంగా మరచిపోలేని మధురమైన కానుక ఇచ్చారు. ఇప్పుడు అందరి దృష్టి మే 20వ తేదీ పుట్టినరోజు జరుపుకునే తారక్ “కొమరం భీం” క్యారెక్టర్ వీడియో తెరపై ఎలా ఉంటుంది.? అని ఇప్పటికే అంచనాలు మొదలయ్యాయి.ఇక ఆ వీడియోను తన తమ్ముడు భీమ్ కి స్వయంగా అన్న రామరాజు కానుకగా ఇవ్వడం ఖాయం. మొత్తం మీద ఎస్.ఎస్ రాజమౌళి ఈ సినిమా ద్వారా ఇద్దరు అంతర్జాతీయ స్థాయి హీరోలను వెండితెరకు అందిస్తున్నట్లుగా అనిపిస్తోంది.