`ఆర్ఆర్ఆర్‌` నుంచి రామ‌రాజు వ‌చ్చేస్తున్నాడు!


`ఆర్ఆర్ఆర్‌` నుంచి రామ‌రాజు వ‌చ్చేస్తున్నాడు!
`ఆర్ఆర్ఆర్‌` నుంచి రామ‌రాజు వ‌చ్చేస్తున్నాడు!

భార‌తీయ తెర‌పై మునుపెన్న‌డూ చూడ‌ని అద్భుతం `ఆర్ఆర్ఆర్‌`. హీరో పాత్ర‌ల్ని మ‌రింత ఫెరోషియ‌స్‌గా తెర‌పైకి తీసుకురావ‌డంలో రాజ‌మౌళిని మించిన ద‌ర్శ‌కులు లేరంటే అది ఎంత మాత్ర‌ము అతిశ‌యోక్తికాదు. విక్ర‌మార్కుడు, మ‌గ‌ధీర‌, బాహుబ‌లి చిత్రాలు చూస్తే ఈ విష‌యం స్ప‌ష్ట‌మ‌వుతుంది. అలాంటి రాజ‌మౌళి పాన్ ఇండియా స్థాయి విజ‌యం త‌రువాత చేస్తున్న చిత్రం `ఆర్ఆర్ఆర్‌`. మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ తొలిసారి క‌లిసి న‌టిస్తున్న అత్య‌త భారీ మ‌ల్టీస్టార‌ర్ చిత్ర‌మిది.

ఈ సినిమా నుంచి ఫ‌స్ట్‌లుక్ ఎప్పుడెప్పుడు వ‌స్తుందా అని వేయి క‌ళ్ల‌తో ఎదురుచూసిన సినీ ప్రేక్ష‌కుల‌కు ఉగాది రోజున `ఆర్ఆర్ఆర్‌` టైటిల్ లోగో మోష‌న్ పోస్ట‌ర్‌తో స‌ర్‌ప్రైజ్‌ని అందించి సినిమా ఏ రేంజ్‌లో రెడీ అవుతోందో హిట్ ఇచ్చేసింది. 1920 బ్రిటీష్ ఇండియా కాలం నేప‌థ్యంలో ఈ సినిమా తెర‌కెక్కుతోంది అన్న విష‌యాన్ని టైటిల్‌లోగోలోనే రివీల్ చేశారు. ఇద్ద‌రి పాత్ర‌లు ఒక‌రు నిప్పు…మ‌రొక‌రు ఉప్పెన.. ఇలా రామ్‌చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్‌ల పాత్ర‌లు సాగుతాయ‌ని అర్థ‌మ‌వుతోంది.

ఇదిలా వుంటే ఈ శుక్ర‌వారం ఉద‌యం 10 గంట‌ల‌కు ఈ చిత్ర బృందం నుంచి మ‌రో స‌ర్‌ప్రైజ్ రాబోతోంది.
ఈ రోజు హీరో మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ పుట్టిన రోజు. ఈ పంద‌ర్భంగా స్పెష‌ల్ స‌ర్‌ప్రైజ్‌ని అందించ‌బోతున్నారు. రామ్‌చ‌ర‌ణ్ క్యారెక్ట‌ర్ అల్లూరి సీతారామ‌రాజుకు సంబంధించిన లుక్‌ని ఈ రోజు రివీల్ చేయ‌మ‌బోతున్న‌ట్టు అర్థ‌మ‌వుతోంది. సోష‌ల్ మీడియా వేదిగా యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ పెట్టిన పోస్ట్ ఈ విష‌యాన్ని స్ప‌ష్టం చేస్తోంది. రామ్‌చ‌ర‌ణ్ నీ పుట్టిన రోజుని ఆనంద‌క‌ర‌మైన ప‌రిస్థితుల్లో జ‌రుపుకోవాల‌ని కోరుకున్నాను. కానీ మ‌న‌ము ఇప్పుడు లాక్‌డౌన్ లో వున్నాం. ఈ ప‌రిస్థితుల్లో అంతా ఇంట్లో వుండ‌టం ముఖ్యం. 10 గంట‌ల‌కు డిజిట‌ల్ వేదిక‌గా నీకు స‌ర్‌ప్రైజ్ ఇవ్వ‌బోతున్నాను. ఇది నీకు మ‌ర్చిపోలేని స‌ర్‌ప్రైజ్‌గా మిగిలిపోతుంది` అని ట్వీట్ చేశాడు.

Credit: Twitter