త్రివిక్రమ్ సినిమాలో ఎన్టీఆర్ రోల్ అదేనా?


త్రివిక్రమ్ సినిమాలో ఎన్టీఆర్ రోల్ అదేనా?
త్రివిక్రమ్ సినిమాలో ఎన్టీఆర్ రోల్ అదేనా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్న విషయం తెల్సిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ఆగిపోయింది. 75 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్నప్పటికీ ఈ సినిమాకు విఎఫ్ఎక్స్ పనులు చాలా బ్యాలెన్స్ ఉండిపోవడం వల్ల ముందుగా జనవరి 8, 2021న అనుకున్న ఈ సినిమా రిలీజ్ ఇప్పుడు సమ్మర్ కు వాయిదా పడింది.

ఎన్టీఆర్ ఈ సినిమా పూర్తవ్వగానే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేయడానికి ఒప్పుకున్న విషయం తెల్సిందే. ఈ సినిమా షూటింగ్ ను ఈ ఏడాది జులై నుండి మొదలుపెట్టాలని నిర్ణయించారు కానీ లాక్ డౌన్ కారణంగా ఇప్పుడు మరింత ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి.

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేయబయే చిత్రానికి అయినను పోయి రావలె హస్తినకు అనే టైటిల్ ను అనుకుంటున్నారు. తాజాగా ఈ చిత్రం గురించి బయటపడిన విషయం ఫ్యాన్స్ కు బోలెడంత ఆనందాన్ని పంచుతోంది. ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఎన్టీఆర్ టాప్ బిజినెస్ మ్యాన్ గా కనిపించనున్నాడట. అలాగే పాత్ర కోసం ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర చాలా స్టైలిష్ గా ఉంటుందని, ఆర్ ఆర్ ఆర్ నుండి పూర్తి మేకోవర్ కు ఎన్టీఆర్ మారిపోతాడని అంటున్నారు. మరి ఇందులో నిజమెంతుందో తెలియాలంటే మరికొద్ది నెలలు వేచి చూడక తప్పదు.

ఇక ఈ సినిమాకు సంబంధించి మరే వివరాలు ప్రస్తుతం అందుబాటులో లేవు. త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రిప్ట్ పూర్తి చేసి డైలాగ్ వెర్షన్ రాస్తున్నట్లు తెలుస్తోంది.