ఎన్టీఆర్ 30కి టైటిల్ అనౌన్స్ చేస్తున్నారా?


ఎన్టీఆర్ 30కి టైటిల్ అనౌన్స్ చేస్తున్నారా?
ఎన్టీఆర్ 30కి టైటిల్ అనౌన్స్ చేస్తున్నారా?

యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్, మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కాబినేష‌న్‌లో రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న భారీ మ‌ల్టీస్టార‌ర్ చిత్రం `ఆర్ ఆర్ ఆర్‌`. డీవీవీ దాన‌య్య అత్యంత భారీ బ‌డ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఉభ‌య తెలుగు రాష్ట్రాల‌కు సంబంధించిన ఫ్రీడ‌మ్ ఫైట‌ర్స్ అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌లో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, కొమ‌రం భీం పాత్ర‌లో ఎన్టీఆర్ న‌టిస్తున్నారు.

ఇప్ప‌టికే దాదాపు 80 శాతం చిత్రీక‌రణ పూర్త‌యింది. ఈ చిత్రాన్ని వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 8న రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు. ఇప్ప‌టికే హీరోలిద్ద‌రు డ‌బ్బింగ్ కార్య‌క్ర‌మాలు మొద‌లుపెట్టిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇదిలా వుంటే ఈ చిత్రం త‌రువాత యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌బోతున్న విష‌యం తెలిసిందే.

ఎన్టీఆర్ న‌టించ‌నున్న 30వ చిత్ర‌మిది. హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్స్‌పై ఎస్‌. రాధాకృష్ణ‌, నంద‌మూరి క‌ల్యాణ్‌రామ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నారు. మే 20న ఎన్టీఆర్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఈ చిత్ర టైటిల్‌ని ప్ర‌క‌టించాల‌ని, ఫ‌స్ట్‌లుక్‌ని రిలీజ్ చేయాల‌ని చిత్ర బృందం ప్లాన్ చేస్తున్న‌ట్టు తెలిసింది. పొలిటిక‌ల్ నేప‌థ్యంలో ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో నిర్మించ‌బోతున్నారు.