ఈ సారి ప‌క్కా పొలిటిక‌ల్ ట‌చ్‌!


ఈ సారి ప‌క్కా పొలిటిక‌ల్ ట‌చ్‌!
ఈ సారి ప‌క్కా పొలిటిక‌ల్ ట‌చ్‌!

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి `ఆర్ ఆర్ ఆర్‌` చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్న విష‌యం తెలిసిందే. ఇందులో కొమ‌రం భీంగా యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్‌, అల్లూరి సీతారామ‌రాజుగా రామ్‌చ‌ర‌ణ్ న‌టిస్తున్నారు. ఈ సినిమా చిత్రీక‌రణ ద‌శ‌లో వుండ‌గానే ఈ హీరోలిద్ద‌రు త‌మ త‌దుప‌రి చిత్రానికి రెడీ అవుతున్నారు. రామ్‌చ‌ర‌ణ్ ఓ ప‌క్క మెగాస్టార్‌తో కొర‌టాల రూపొందిస్తున్న సినిమా ప‌నుల్లో బిజీగా గ‌డిపేస్తూరే మ‌రో ప‌క్క త‌దుపరి చిత్రం కోసం `జెర్సీ` ద‌ర్శ‌కుడితో చ‌ర్చ‌లు జ‌రుపుతున్న‌ట్టు తెలిసింది.

ఎన్టీఆర్ మాత్రం త‌న త‌దుపరి చిత్రాన్ని మాట‌మాంత్రికుడు త్రివిక్ర‌మ్‌తో చేయ‌బోతున్నారు. ఇప్ప‌టికే ఈ చిత్రం కోసం ఓ ప‌వర్‌ఫుల్ స్టోరీని సిద్ధం చేశార‌ట‌. వీరిద్ద‌రి తొలి క‌ల‌యిక‌లో `అర‌వింద స‌మేత‌` రూపొందిన విష‌యం తెలిసిందే. ఈ చిత్రంలో సీమ ముఠా క‌క్ష‌లు ఐదు రూపాయ‌ల ఫ్యాక్ష‌న్ వంటి వ‌ర్గ పోరుని చూపించి పాలిటిక్స్‌ని పైపైన ట‌చ్ చేసిన త్రివిక్ర‌మ్ తాజా సినిమాకు మాత్రం కంప్లీట్ పొలిటిక‌ల్ నేప‌థ్యాన్ని ఎంచుకున్న‌ట్టు తెలుస్తోంది.

హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ఈ చిత్రాన్ని ఏప్రిల్ నుంచి సెట్స్‌పైకి తీసుకొచ్చే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయ‌ని తెలిసంది. ఇందులో హీరోయిన్ ఎవ‌రుంటారు?. ఎన్టీఆర్ పాత్ర చిత్ర‌ణ ఎలా వుంటుంది? అన్న విష‌యాలు త్వ‌ర‌లోనే బ‌య‌టికి రానున్నాయి. రామ్‌చ‌ర‌ణ్‌తో క‌లిసి ఎన్టీఆర్ న‌టిస్తున్న తాజా చిత్రం `ఆర్ ఆర్ ఆర్‌` వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 8న రిలీజ్‌కు సిద్ధ‌మ‌వుతోంది.