తొలిసారి కంఫర్ట్ జోన్ దాటి సినిమా చేయబోతున్న త్రివిక్రమ్ శ్రీనివాస్


తొలిసారి కంఫర్ట్ జోన్ దాటి సినిమా చేయబోతున్న త్రివిక్రమ్ శ్రీనివాస్
తొలిసారి కంఫర్ట్ జోన్ దాటి సినిమా చేయబోతున్న త్రివిక్రమ్ శ్రీనివాస్

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ టాలీవుడ్ లో టాప్ దర్శకులలో ఒకరు. ఈయన సినిమాలకు సక్సెస్ రేట్ ఎక్కువే. దానికన్నా త్రివిక్రమ్ మాటలు అంటే చెవి కోసుకునే ఫ్యాన్స్ లక్షల్లో ఉన్నారు. కేవలం త్రివిక్రమ్ మాటలకోసమే సినిమాలు చూసేవాళ్ళు కూడా ఎక్కువే. నిజాయితీగా మాట్లాడుకుంటే త్రివిక్రమ్ దర్శకుడు అయ్యాక కంటే అవ్వకముందు త్రివిక్రమ్ రచనలకు ఇప్పటికీ ఫ్యాన్స్ ఉన్నారు. స్వయంవరం, చిరునవ్వుతో, నువ్వే కావాలి, వాసు, నువ్వు నాకు నచ్చావ్, మన్మథుడు.. ఇలా త్రివిక్రమ్ పెన్ను పడిన సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాల్సిందే. త్రివిక్రమ్ కు తెలుగు భాష మీద ఉన్న పట్టు అటువంటిది. దర్శకుడయ్యాక పెన్ను నుండి వచ్చే చెమకులు కొంచెం తగ్గినా ఇప్పటికీ త్రివిక్రమ్ సినిమా అంటే డైలాగ్స్ కు ఫేమస్. త్రివిక్రమ్ కు తెలుగు భాష మీద ఉన్న పట్టు అటువంటిది. త్రివిక్రమ్ లోని దర్శకుడ్ని, రచయిత కాపాడిన సందర్భాలు కోకొల్లలు.

అందుకే త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎప్పుడూ నేల విడిచి సాము చేయలేదు. తన బలమేంటో, బలహీనత ఏంటో త్రివిక్రమ్ కు బాగా తెలుసు. అందుకే తన సినిమాల్లో ఎక్కువగా ఫ్యామిలీ సెంటిమెంట్స్, డ్రామా,యాక్షన్, కామెడీ ఈ జోనర్లను టచ్ చేస్తూనే సినిమా చేస్తూ వస్తున్నాడు. దర్శకుడిగా త్రివిక్రమ్ శ్రీనివాస్ మొదటి సినిమా నువ్వే నువ్వే నుండి తను ఇదే పంథాలో సినిమాలు తీస్తున్నాడు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో చేస్తున్న లేటెస్ట్ సినిమా అల వైకుంఠపురములో కూడా ఇవే హైలైట్ కానున్నాయి. ఇందులో కూడా ఫ్యామిలీ సెంటిమెంట్స్, కామెడీ ప్రధానంగా తీస్తున్నాడు.

అయితే తొలిసారి త్రివిక్రమ్ శ్రీనివాస్ తన బలాన్ని విడిచి కొత్త ప్రయత్నం చేయబోతున్నాడు. అల వైకుంఠపురములో తర్వాత ఎన్టీఆర్ తో చేయబోతున్న సినిమాను త్రివిక్రమ్ ప్యాన్ ఇండియాగా తీయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇప్పటికే త్రివిక్రమ్ ఈ కథకు సంబంధించిన లైన్ ఎన్టీఆర్ కు వినిపించడం కూడా పూర్తయిందని తెలుస్తోంది. ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ చేస్తున్నాడు. వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో ఫ్రీ అవుతాడు. ఆర్ ఆర్ ఆర్ నుండి ఫ్రీ అయిన వెంటనే త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమాలో జాయిన్ అవుతాడు. దాదాపు 200 కోట్ల బడ్జెట్ ఉంటుందని ప్రాధమికంగా అంచనా వేశారు. ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ తర్వాత ప్యాన్ ఇండియా సినిమా చేయాలనే నిర్ణయించుకున్నాడు కానీ బయట దర్శకులని కన్సిడర్ చేసాడు. తమిళ్ స్టార్ దర్శకుడు అట్లీ, కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్.. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరితో సినిమా కమిట్ అవ్వాలని చాలా రోజులు ఆలోచించాడు. అయితే తెలుగు రాష్ట్రాల ప్రజల అభిరుచి, తన బలం వగైరా అంశాల గురించి అవగాహన ఉన్న తెలుగు దర్శకుడైతే మేలని త్రివిక్రమ్ శ్రీనివాస్ కు ఓటేసినట్లు తెలుస్తోంది.

మరి త్రివిక్రమ్ శ్రీనివాస్ తొలిసారి తన కంఫర్ట్ జోన్ నుండి బయటకు వచ్చి చేయబోతున్న ఈ ప్రయత్నం సక్సెస్ అవ్వాలని మనం కూడా కోరుకుందాం.