ఎన్టీఆర్, త్రివిక్రమ్ జోనర్ ఫిక్స్ అయిపోయిందా


NTR Trivikram Srinivas project to be a comedy entertainer
NTR Trivikram Srinivas project to be a comedy entertainer

అజ్ఞాతవాసి సినిమాతో త్రివిక్రమ్ బ్రాండ్ ఇమేజ్ కు దెబ్బ తగిలింది. లైట్ హార్టెడ్ ఫ్యామిలీ ఎంటెర్టైనర్లు తీయడంలో సూపర్ సక్సెస్ఫుల్ అయిన త్రివిక్రమ్ అజ్ఞాతవాసి సినిమాతో తన మీద అనుమానాలు కలిగేలా చేసుకున్నాడు. అందుకనే అరవింద సమేత అంటూ తనది కాని జోనర్ టచ్ చేసి ముందు ప్లాప్ నుండి బయటపడ్డాడు. మళ్ళీ అల వైకుంఠపురములో అంటూ తనకు అచొచ్చిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ వైపే చూసాడు. ఈ సినిమా విడుదలకు ముందు త్రివిక్రమ్ పై అనుమానాలు అలాగే ఉన్నాయి. అయితే పాటలు హిట్ కావడంతో సినిమాపై పాజిటివ్ బజ్ ఏర్పడింది. అది చిత్రానికి చాలా ఉపయోగపడింది.

త్రివిక్రమ్ శ్రీనివాస్ మళ్ళీ తనదైన శైలి టేకింగ్ తో అల వైకుంఠపురములో చిత్రాన్ని మరో లెవెల్ కు తీసుకెళ్లాడు. తనపై ఎవరికైనా అనుమానాలు ఉంటే వాళ్ళ చేతే గురూజీ ఈజ్ బ్యాక్ అనిపించాడు. అల వైకుంఠపురములో చిత్రం అటు బన్నీ కెరీర్ లో, ఇటు త్రివిక్రమ్ శ్రీనివాస్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అయింది. అల వైకుంఠపురములో చిత్రాన్ని బ్లాక్ బస్టర్ విజయం చేసిన త్రివిక్రమ్ తన నెక్స్ట్ సినిమాను ఎన్టీఆర్ తో చేయబోతున్న విషయం తెల్సిందే.

హారిక అండ్ హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి. అల వైకుంఠపురములో చిత్రాన్ని తన మ్యూజిక్ తో ఎక్కడికో తీసుకెళ్లిన థమన్ ఈ చిత్రానికి కూడా సంగీతం అందించనున్నాడు. ముందు ఎన్టీఆర్ తో చేసే సినిమా మాస్ ఎంటర్టైనర్ అంటూ ప్రచారం జరిగింది కానీ ఇది కూడా కూల్ గా సాగిపోయే కామెడీ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. అల వైకుంఠపురములో చిత్రంలో ఎక్కువ కామెడీ లేకుండా కూల్ గా వెళ్లిపోయేలా చేసిన త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో చేసే సినిమాను మాత్రం ఫుల్ కామెడీతో నింపేయబోతున్నట్లు తెలుస్తోంది.