ఎన్టీఆర్ సినిమా ఆగిందంటే నిర్మాత సెటైర్‌!‌

ఎన్టీఆర్ సినిమా ఆగిందంటే నిర్మాత సెటైర్‌!‌
ఎన్టీఆర్ సినిమా ఆగిందంటే నిర్మాత సెటైర్‌!‌

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ 30వ చిత్రాన్ని మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ డైరెక్ట్ చేయ‌బోతున్న విష‌యం తెలిసిందే. హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించ‌బోతున్నారు. ఇప్ప‌టికే ఈ చిత్రానికి సంబంధించిన ఫార్మ‌ల్ పూజా కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. ఇక రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభించ‌డ‌మే త‌రువాయి. అయితే తాజాగా ఈ సినిమా ఆగిపోయింద‌ని, అన‌వార్య కార‌ణాల వ‌ల్లే స‌ద‌రు హీరో, ద‌ర్శ‌కుడు ఓ నిర్ణ‌యానికి వ‌చ్చి ఆపేశారంటూ క‌థ‌నాలు మొద‌ల‌య్యాయి.

అయితే ఈ క‌థ‌నంపై నిర్మాత సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ సెటైరిక‌ల్‌గా స్పందించ‌యారు. సోష‌ల్ మీడియా వేదిక‌గా ఈ వార్త‌పై `గుడ్ జోక్` అంటూ న‌వ్వుతున్న ఎమోజీల‌ని పోస్ట్ చేశారు. దీంతో ఈ సినిమా ఆగిపోయింద‌న్న‌ది ఫేక్ న్యూస్ అని స్ప‌ష్ట‌మైంది. ఇప్ప‌టికే స్క్రిప్ట్ వ‌ర్క్ పూర్త‌యిన ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ఈ నెల 13 నుంచి ప్రారంభం కానున్న‌ట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. అయితే ప్ర‌స్తుతం త్రివిక్ర‌మ్  కోవిడ్ బారిన ప‌డ‌టంతో ఈ షెడ్యూల్ మారే అవ‌కాశం వుంద‌ని తెలుస్తోంది.

ప్ర‌స్తుతం ఎన్టీఆర్ `ఆర్ ఆర్ ఆర్‌` చిత్రంలో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. రామ్‌చ‌ర‌ణ్‌తో క‌లిసి ఎన్టీఆర్ న‌టిస్తున్న ఈ మూవీకి సంబంధించిన క్లైమాక్స్ ఘ‌ట్టాల చిత్రీక‌ర‌ణ ప్ర‌స్తుతం జ‌రుగుతోంది. అత్యంత భారీ స్థాయిలో రోమాంచిత స‌న్నివేశాల‌తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని అక్టోబ‌ర్ 13న విజ‌య‌ద‌శ‌మి సంద‌ర్భంగా రిలీజ్ చేయ‌నున్న విష‌యం తెలిసిందే.