సెప్టెంబర్ 20న ఎన్టీఆర్ అరవింద ఆడియో


NTRs Aravinda sametha veera raghava audio functions on sep 20thసెప్టెంబర్ 20న యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత వీర రాఘవ ఆడియో వేడుక నిర్వహించనున్నట్లు తెలుస్తోంది . త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 11న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . కాగా సెప్టెంబర్ 20న ఆడియో వేడుక నిర్వహించాలని సూత్రప్రాయంగా ఓ నిర్ణయానికి వచ్చారట ! అలాగే ఈ ఆడియో వేడుకకు ముఖ్య అథితిగా బాబాయ్ బాలకృష్ణ ని ఆహ్వానించాలని కూడా అనుకుంటున్నారట . ఇటీవల హరికృష్ణ మరణంతో బాలయ్య -ఎన్టీఆర్ లు మళ్ళీ ఒక్కటయ్యారు దాంతో బాలయ్య బాబాయ్ అరవింద వేడుకకు రావడం ఖాయమని అంటున్నారు .

రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే నటిస్తుండగా కీలక పాత్రల్లో జగపతిబాబు , నాగబాబు , ఈషా రెబ్బ లు నటిస్తున్నారు . బ్యాలెన్స్ గా ఉన్న మూడు పాటలను త్వరగా ఫినిష్ చేయాలనీ తహతహలాడుతున్నారు చిత్ర బృందం .

English Title: NTRs Aravinda sametha veera raghava audio functions on sep 20th