అరవింద సమేత రిలీజ్ డేట్


ntrs aravinda sametha veera raghava gets release dateయంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ” అరవింద సమేత వీర రాఘవ ” చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే . ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే , ఈషా రెబ్బా లు నటిస్తున్న ఈ చిత్రాన్ని దసరా కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . కాగా తాజాగా డేట్ కూడా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది అక్టోబర్ 11న అరవింద సమేత వీర రాఘవ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు .

రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సీనియర్ నటులు జగపతిబాబు , నాగబాబు లు కీలక పాత్రలు పోషిస్తున్నారు . ప్రస్తుతం కాలేజ్ నేపథ్యంలో సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు త్రివిక్రమ్ . ఎన్టీఆర్ – పూజా హెగ్డే లపై కీలకమైన రొమాంటిక్ సీన్స్ చిత్రీకరిస్తున్నారట . ఫ్యాక్షన్ కి తోడు మానవీయ విలువల్ని కలగలిపి త్రివిక్రమ్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడని అంటున్నారు . ఇక ఈ సినిమా విడుదల తేదీ కోసం ఎన్టీఆర్ అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు . ఇప్పుడు రిలీజ్ డేట్ అక్టోబర్ 11 అని తేలింది కాబట్టి ఎన్టీఆర్ అభిమానుల ఆనందానికి అంతే లేకుండా పోతుంది . ఎన్టీఆర్ – త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో వస్తున్న మొదటి సినిమా కాబట్టి ఈ చిత్రం పై భారీ అంచనాలు ఉన్నాయి . ఆగస్టు 15 న స్వాతంత్య్ర దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకొని టీజర్ ని విడుదల చేసే పనిలో ఉన్నారట చిత్ర బృందం .

English Title: ntrs aravinda sametha veera raghava gets release date