ఫ్యాన్స్ కోసం టీజర్ ని రెడీ చేస్తున్న ఎన్టీఆర్


Ntrs aravinda sametha veera raghava teaser for fans

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన అభిమానుల కోసం అరవింద సమేత వీర రాఘవ చిత్ర టీజర్ ని రెడీ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు . స్వాతంత్య్ర దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకొని టీజర్ ని రిలీజ్ చేయనున్నారు . త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం రాయలసీమ నేపథ్యంలో రూపొందుతున్న విషయం తెలిసిందే . ఇప్పటికే ఎన్టీఆర్ ఫ్యాక్షన్ తో పోరాడిన తాలూకు స్టిల్ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే . దాంతో పాటు పలు స్టిల్స్ లీక్ అయి ఆ చిత్ర బృందాన్ని కలవరపాటు కి గురిచేశాయి .

ఇప్పటికే 70 శాతం కు పైగా షూటింగ్ పూర్తిచేసుకున్న అరవింద సమేత వీర రాఘవ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 10 న భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్టున్నారు . ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే , ఈషా రెబ్బా నటిస్తుండగా కీలక పాత్రల్లో జగపతిబాబు , నాగబాబు లు నటిస్తున్నారు . ప్రస్తుతం భువనగిరి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా పై ఎన్టీఆర్ , త్రివిక్రమ్ లతో పాటుగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు . టీజర్ తో ఫ్యాన్స్ ని సంతోషంలో ముంచెత్తడానికి సన్నాహాలు చేసున్నారట . ఆగస్టు 14 సాయంత్రం లేదా ఆగస్టు 15 ఉదయం టీజర్ ని విడుదల చేయనున్నారు అరవింద సమేత వీర రాఘవ చిత్ర బృందం .

English Title: ntrs aravinda sametha veera raghava teaser for fans