ఎన్టీఆర్ ఎన్‌హెచ్‌కే కు స్టార్ట్ చేస్తున్నాడా?


ఎన్టీఆర్ ఎన్‌హెచ్‌కే కు స్టార్ట్ చేస్తున్నాడా?
ఎన్టీఆర్ ఎన్‌హెచ్‌కే కు స్టార్ట్ చేస్తున్నాడా?

ప్రస్తుతం హీరోలందరూ రెమ్యునరేషన్లు అందుకునే విషయంలో తమ స్ట్రాటజీలను మార్చుకుంటున్నారు. ఇదివరకటిలా రెమ్యునరేషన్లు తీసుకోవట్లేదు. లాభాల్లో వాటా తీసుకుంటున్నారు. సొంతంగా నిర్మాణ సంస్థలు స్థాపించుకుంటున్నారు. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, నాని, నితిన్, సందీప్ కిషన్ లాంటి వాళ్లందరికీ ఇప్పుడు సొంత నిర్మాణ సంస్థలు ఉన్నాయి. తమ సినిమాల్లో వీటిని భాగస్వామ్యం చేసి లాభాల్లో వాటాను తీసుకుంటున్నారు. ఇప్పుడు ఈ లిస్ట్ లో ఎన్టీఆర్ కూడా చేరబోతున్నాడు. గత కొంత కాలంగా ఎన్టీఆర్ సొంత నిర్మాణ సంస్థ గురించి వార్తలు వస్తున్న విషయం తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం తన నెక్స్ట్ సినిమాకు తన నిర్మాణ సంస్థను భాగస్వామిని చేయబోతున్నాడట.

ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్నాడు. ఈ చిత్రంలో కొమరం భీమ్ పాత్రలో కనిపించనున్నాడు. తన పార్ట్ షూటింగ్ మే తో పూర్తవుతుంది కాబట్టి జూన్ నుండి తన నెక్స్ట్ సినిమాను మొదలుపెట్టాలని ప్లాన్ చేసుకున్నాడు. అయితే ఇప్పుడు కరోనా వైరస్ కారణంగా షూటింగ్ లేట్ అవ్వనుండడంతో కచ్చితంగా తన నెక్స్ట్ సినిమా షూటింగ్ మొదలుపెట్టడానికి కూడా అనుకున్న దానికంటే ఆలస్యమవుతుంది.

త్రివిక్రమ్ శ్రీనివాస్ తో తన నెక్స్ట్ సినిమాను చేయబోతున్నట్లు ఎన్టీఆర్ ఇప్పటికే ప్రకటించాడు. ఈ సినిమాకు నిర్మాతలుగా త్రివిక్రమ్ ఆస్థాన నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసినితో పాటు నందమూరి కళ్యాణ్ రామ్ కూడా ఉండనున్నాడు. అయితే తాజా సమాచారం ప్రకారం ఎన్టీఆర్ తను పెట్టబోయే నిర్మాణ సంస్థ ఎన్‌హెచ్‌కే ఆర్ట్స్ ను ఈ సినిమాకు స్లీపింగ్ పార్ట్నర్ గా చేయబోతున్నాడు. అయితే త్రివిక్రమ్ తో చేసే సినిమా తర్వాత చేయబోయే సినిమాకు ఎన్‌హెచ్‌కే ఆర్ట్స్ నిర్మాణంలోనే తెరకెక్కించాలని భావిస్తున్నాడు. ఇకపై తన సినిమాలు అన్నిటికీ ఈ నిర్మాణ సంస్థను భాగం చేయాలన్న ఉద్దేశం ఉంది. మరి ఎన్టీఆర్ నిర్మాతగా ఎంతవరకూ సక్సెస్ అవుతాడన్నది వేచి చూడాలి.