ఎన్టీఆర్ ఎన్నారైగా కనిపించబోతున్నాడా?


ఎన్టీఆర్ ఎన్నారైగా కనిపించబోతున్నాడా?
ఎన్టీఆర్ ఎన్నారైగా కనిపించబోతున్నాడా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ పరంగా భీభత్సమైన ఫామ్ లో ఉన్న విషయం తెల్సిందే. ఎన్టీఆర్ నటించిన గత నాలుగు సినిమాలు కూడా మంచి విజయం సాధించాయి. అయితే 2018లో అరవింద సమేత చేసిన తర్వాత ఎన్టీఆర్ నుండి సినిమా లేదు. అప్పటినుండి పూర్తిగా ఆర్ ఆర్ ఆర్ కే తన సమయాన్ని కేటాయిస్తూ వచ్చాడు. ప్రస్తుతం కరోనా కారణంగా సినిమా షూటింగ్ వాయిదా పడడంతో ఆర్ ఆర్ ఆర్ 2021 సంక్రాంతి సీజన్ నుండి సమ్మర్ కు వాయిదా పడింది. దీంతో రెండేళ్ల నుండి సినిమా లేని ఎన్టీఆర్ వచ్చే ఏడాది రెండు సినిమాలను తన ఫ్యాన్స్ కు అందించాలని భావిస్తున్నాడు.

ఆర్ ఆర్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటించడానికి ఓకే చెప్పిన విషయం తెల్సిందే. అయినను పోయి రావాలె హస్తినకు అనే టైటిల్ ను కూడా ఈ ప్రాజెక్ట్ కు అనుకుంటున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర గురించి ఒక ఆసక్తికర అప్డేట్ ఇప్పుడు బయటకు వచ్చింది. ఇందులో ఎన్టీఆర్ ఎన్నారై పాత్రలో కనిపిస్తాడట.

అనుకోని పరిస్థితుల్లో ఎన్టీఆర్ ఇండియా రావాల్సి రావడం, అక్కడి నుండి అనుకోకుండా ఇక్కడి రాజకీయ సమీకరణాల్లో మార్పుకు కారణమవ్వడం వంటి విషయాలతో ఈ సినిమా చాలా ఆసక్తికరంగా ఉంటుందని తెలుస్తోంది. వీటితో పాటు త్రివిక్రమ్ మార్క్ ఎంటర్టైన్మెంట్ మిస్ అవ్వకుండా ఉంటుందిట. ఇద్దరు హీరోయిన్స్ ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన ఆడిపాడతారట. మరిన్ని విశేషాలు త్వరలోనే తెలుస్తాయి.